Jabardasth Varsha: సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది. ఏళ్ల తరబడి రాని ఫేమ్ అనతికాలంలో సొంతమైంది. ప్రస్తుతం బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా వర్ష ఉన్నారు. ఒకప్పుడు జబర్దస్త్ లో అమ్మాయిల పాత్రలు అబ్బాయిలే వేసేవారు. లేడీ గెటప్స్ చూడలేక ఆడియన్స్ అల్లాడిపోయారు. మెల్లగా జబర్దస్త్ కి లేడీ కమెడియన్స్ ఎంటర్ అయ్యారు. సన్నజాజి తీగలా నాజూగ్గా ఉండే వర్ష గ్లామర్ జబర్దస్త్ ప్రేక్షకులను ఫిదా చేసింది. దాంతో ఆమెకు అభిమాన వర్గం ఏర్పడింది.
వర్ష పాపులర్ కావడానికి మరొక రీజన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్. వర్ష-ఇమ్మానియేల్ ల కామెడీ స్కిట్స్,లవ్ ట్రాక్స్ బాగా ఆదరణ పొందాయి. బుల్లితెర లవర్స్ గా వీరు అవతరించారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ అనంతరం ఆ రేంజ్ లో పాపులరైన జంటని చెప్పొచ్చు. వీరికి కూడా ఒకటి రెండు సార్లు ఉత్తుత్తి పెళ్లి చేశారు. ఇమ్మానియేల్ అంటే వర్ష వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం అంటుంది.
మరి నిజంగా వీరి మధ్య ప్రేమ ఉందా? కేవలం కెరీర్ కోసమా? అనేది సస్పెన్స్. ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో సందడి చేస్తుంది. ఆమె ఇమేజ్ భారీగా పెరగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బులు ఆర్జిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో వర్షకు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఓ టైర్ టూ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు.
వర్షను ఇంతలా ఫాలో అవడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేస్తుంది. ఒకప్పుడు పద్దతిగా ఫోటో షూట్స్ చేసిన ఈ యంగ్ బ్యూటీ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో క్రేజీ లుక్ లో దర్శనమిచ్చింది. జానెడు కూడా లేని ఆ గౌన్ లో వర్ష థైస్ హైలెట్ అయ్యాయి. వర్ష తీరు చూస్తుంటే రష్మీ, అనసూయ, శ్రీముఖిని కూడా బీట్ చేసేలా ఉంది. వర్ష హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.