Homeఎంటర్టైన్మెంట్Jabardast Emmanuel : జబర్దస్త్ ఇమ్మానియేల్ షాకింగ్ మేకోవర్, ఎందుకో తెలిస్తే అవాక్కే!

Jabardast Emmanuel : జబర్దస్త్ ఇమ్మానియేల్ షాకింగ్ మేకోవర్, ఎందుకో తెలిస్తే అవాక్కే!

Jabardast Emmanuel : జబర్దస్త్ సీనియర్ కమెడియన్ ఇమ్మానియేల్ పూర్తిగా మారిపోయాడు. ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లుక్ వైరల్ అవుతుంది. స్లిమ్ గా ఉన్న ఇమ్మానియేల్ తలపై ఒత్తైన జుట్టుతో కనిపించాడు. ఇక తన న్యూ లుక్ కి ‘త్వరలో ఈ లుక్ తో మీ ముందుకు వస్తా.. వెయిట్ అండ్ వాచ్’ అని కామెంట్ పెట్టాడు. కొంచెం పొట్ట, బట్టతలతో డీగ్లామర్ గా కనిపించే ఇమ్మానియేల్ ఎలా హ్యాండ్సమ్ గా మారిపోవడానికి పెద్ద కారణమే ఉందని ప్రచారం జరుగుతుంది. ఇమ్మానియేల్ బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నాడట.

గత ఎనిమిది సీజన్స్ గమనించిన ఇమ్మానియేల్, టైటిల్ కొట్టాలంటే కేవలం కామెడీ చేస్తే సరిపోదని భావిస్తున్నాడట. అందుకు అవినాష్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. జబర్దస్త్ అవినాష్ సీజన్ 4, సీజన్ 8లలో కంటెస్ట్ చేశాడు. రెండుసార్లు టైటిల్ కొట్టలేకపోయాడు. కానీ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో గొప్ప ఎంటర్టైనర్ గా అవినాష్ కి పేరుంది. అతని కామెడీ టైమింగ్, ఇతరులను అనుకరించడం వంటి అంశాలు ప్రత్యేకంగా నిలిపాయి. కానీ టైటిల్ విన్నర్ కాలేకపోయాడు. కాబట్టి షోలో కేవలం కామెడీ వర్క్ అవుట్ కాదు. అందం, తెలివితేటలు, అద్భుతమైన మెంటల్, ఫిజికల్ గేమ్స్ ద్వారా మాత్రమే టైటిల్ కొట్టగలం అని భావించిన ఇమ్మానియేల్, ఇలా మేకోవర్ అయ్యాడట.

Also Read : జబర్దస్త్ లో బూతు కామెడీ, ‘నువ్వు వస్తే పక్కే నలగదు’ అంటూ ఫైమా డైలాగ్… చూడలేం బాబోయ్!

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మానియేల్ కంటెస్ట్ చేస్తున్నాడని పరిశ్రమలో వినిపిస్తుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కంటెస్ట్ చేస్తున్న కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ లో కంటెస్ట్ చేయడం ఖాయం అట. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో ఉద్దేశం కూడా అదే అనే వాదన ఉంది. ఇక ఇమ్మానియేల్ కి బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో అతడు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇమ్మానియేల్ కి పాపులారిటీ తెచ్చిన అంశాల్లో వర్షతో ఎఫైర్ రూమర్స్ కూడా ఒకటి. వర్ష జబర్దస్త్ కి వచ్చిన కొత్తలో ఇమ్మానియేల్ తో రొమాన్స్ చేసింది. అతడే నా జీవితం అన్నట్లు బిల్డప్ ఇచ్చింది. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ అనంతరం ఆ రేంజ్ లో పాప్యులర్ అయిన జంట వర్ష-ఇమ్మానియేల్. ఇప్పటికీ జబర్దస్త్ లో కలిసి స్కిట్స్ చేస్తున్నారు. ఇక ఇమ్మానియేల్ బిగ్ బాస్ లో ప్రభావం చూపే అవకాశం కలదు. తనకున్న ఫేమ్ రీత్యా ఓట్లు కూడా దండిగా పడతాయి. మంచి ఆట తీరుతో ఆకట్టుకుంటే టైటిల్ విన్నర్ కావచ్చు.

RELATED ARTICLES

Most Popular