Balayya babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే నందమూరి నటసింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం బాలయ్య బాబు(Balayya Babu)బాబి (Babi) డైరెక్షన్ లో చేసిన ‘డాకు మహరాజ్ ‘ (Daaku Maharaj) సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు ఒక గొప్ప సినిమాని చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని రీసెంట్ గా నిర్వహించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ బాలయ్య బాబు నాకు ఒక తండ్రి లాంటి వారు ఆయన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా డ్రీమ్ అలాంటి నా డ్రీమ్ ఇప్పుడు ఫుల్ ఫిల్ అవుతుంది. ఆయన సినిమాలకి మ్యూజిక్ ఇవ్వాలి అంటే అది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయడం లాంటిది. ప్రతి ట్యూన్ చాలా గొప్పగా ఇవ్వాలని చూస్తుంటాను. ఒక సినిమాకి మించిన రేంజ్ లో మ్యూజిక్ ని అందించడానికి నా స్వాయాశక్తుల కష్టపడుతూ ఉంటాను అని చెప్పాడు.
అలాగే 30 రూపాయలకు బాలయ్య బాబు సినిమాలకు పని చేసిన రోజులనుంచి ఆయన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసే అంత ఎత్తుకు ఎదిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లోనే ఈ సినిమా డైరెక్టర్ అయిన బాబీ కూడా బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా చెప్పాడు. ముఖ్యంగా ఆయన చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలని విపరీతంగా చూశానని గుంటూరు మొత్తం అదొక జాతరల సాగేదని చెప్పాడు.
ఇక బాలయ్య బాబు పేరు చెబితే చాలు అభిమానులు ఒక ఎమోషన్ కి ఫీల్ అవుతారని చెప్పాడు. నిజానికి బాలయ్య బాబుని కలవడానికి ముందు ఆయన ఎన్టీఆర్ గారి కొడుకుగా మాత్రమే నాకు తెలుసు కానీ అతన్ని కలిసిన తర్వాత ఆయన గొప్ప మనసుకి నేను ఫిదా అయిపోయాను. ముఖ్యంగా ఆయన దగ్గర అబద్ధాలు చెబితే ఆయనకు నచ్చదు. మనం నిజాయితీగా ఉంటే ఆయన మన నిజాయితీని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నానని చెప్పగానే మా అమ్మ నాన్న ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం… ప్రస్తుతం మా అమ్మానాన్న లేకపోయినా కూడా నేను బాలయ్య బాబుతో సినిమా చేసినందుకు వాళ్ళు ఎక్కడున్నా కూడా చాలా బాగా సంతోషంగా ఫీల్ అవుతారు.
నిజానికి నేను చిరంజీవి అభిమానిని అయినప్పటికీ, బాలయ్య బాబు అంటే నాకు తెలియని ఒక ఎమోషన్ గా మారిపోయారు. మొత్తానికైతే బాలయ్య బాబుకి ఒక మంచి సక్సెస్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, డిఓపి విజయ్ ల కష్టం కూడా చాలా ఉంది అంటూ ఆయన తన టీమ్ గురించి మాట్లాడడం కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించింది…