Kannappa
Kannappa : ఇండస్ట్రీ లో రెబెల్ స్టార్ ప్రభాస్ కి దాదాపుగా అందరూ హీరోలు మంచి మిత్రులే. స్నేహం కోసం ఏమి చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దపడే వ్యక్తి ఆయన. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రభాస్ తరహా సూపర్ స్టార్స్ ఒక్క గంట ని కూడా ఉచితంగా వేరే వాళ్ళ కోసం కేటాయించారు. ఎందుకంటే ఇలాంటి సూపర్ స్టార్స్ కి ప్రతీ క్షణం కూడా కోట్లతో సమానం. ఒక్క రోజు కాల్ షీట్ కోటి నుండి రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా తన మిత్రుడు మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప లో ఒక కీలక పాత్ర చేయాలనీ కోరగా, క్షణం కూడా ఆలోచించకుండా ప్రభాస్ డేట్స్ ఇచ్చేశాడు. పైగా ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ఆశించలేదట.
ఎదో 5 నిమిషాల పాత్ర, లేదా 10 నిమిషాల పాత్రకు ఎవరైనా డేట్స్ ఉచితంగా కేటాయిస్తారేమో, కానీ ప్రభాస్ ఇందులో 40 నిమిషాల నిడివి ఉన్న క్యారక్టర్ ని చేశాడు. పైగా పైసా ఆశించకుండా ఈ మూవీ ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంటాడని అంటున్నారు. ఈ కాలం లో స్నేహం కోసం ఇంత చేసేవాళ్లను ఏతమందిని మనం చూసి ఉంటాము చెప్పండి?. అందుకే ప్రభాస్ అందరిలో అంత స్పెషల్. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో , అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే మహాశివుడి క్యారక్టర్ చేస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని, పార్వతి గా చేస్తున్న కాజల్ అగర్వాల్ పోస్టర్ ని విడుదల చేసారు మేకర్స్. ప్రభాస్ ఈ చిత్రంలో నంది క్యారక్టర్ చేస్తున్నాడని టాక్ ఉంది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
గత ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. VFX వర్క్స్ పూర్తి కాకపోవడం వల్లే వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం మంచు ఫ్యామిలీ 200 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారు. మంచు విష్ణు కి కనీసం పది కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేదు. అలాంటి వ్యక్తిపై ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అనేది సాహసమే. తెలుగు లో ప్రభాస్ ఉండడం వల్ల సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అయితే బాగానే రావొచ్చు. హిందీ లో అక్షయ్ కుమార్, మలయాళం లో మోహన్ లాల్, కన్నడ శివ రాజ్ కుమార్ లను చూసి ఆ ప్రాంతాల్లో ఎంత ఓపెనింగ్ వసూళ్లు ఇస్తారో చూడాలి. ఇకపోతే మూవీ టీం త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు.