https://oktelugu.com/

Pushpa 2 : ‘పుష్ప 2’ లో నటించిన ఈ విలన్ ఆ స్టార్ క్రికెటర్ కి తమ్ముడా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రికార్డులను నెలకొల్పుతూ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 04:11 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రికార్డులను నెలకొల్పుతూ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే. భారత దేశం లోనే ఫాస్టెస్ట్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా పుష్ప 2 చిత్రం చరిత్ర సృష్టించినట్టు కాసేపటి క్రితమే మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. భవిష్యత్తులో ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రంలో నటించిన నటీనటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో మనెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా తారక్ పొన్నప్ప నటించిన సంగతి తెలిసిందే.

    ఇతను ఇదే ఏడాది విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో కూడా ఒక విలన్ గా నటించాడు. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తర్వాత మళ్ళీ ఆయన ‘పుష్ప 2 ‘ చిత్రంలో దర్శనమిచ్చాడు. ఈ చిత్రం ద్వారా తారక్ పొన్నప్ప పేరు నేషనల్ వైడ్ గా ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇతను చూసేందుకు అచ్చం ప్రముఖ స్టార్ క్రికెటర్ క్రునాల్ పాండ్య లాగా ఉన్నాడని, అతనే ఈ సినిమాలో నటించాడని ఫన్నీ ట్రోల్ల్స్ వేశారు. మరికొంత మంది మాత్రం ఇతను క్రునాల్ పాండ్య కి తమ్ముడు అవుతాడని ప్రచారం చేస్తున్నారు. వీటిల్లో ఎలాంటి నిజం లేదు. మనిషిని పోలిన మనిషులు ఉన్నంత మాత్రానా వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉన్నట్టు కాదు, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    తారక్ పొన్నప్ప కన్నడ చలన చిత్ర పరిశ్రమలో మంచి ఇమేజి ఉన్న నటుడు. కేజీఎఫ్ సిరీస్ తో పాటు, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసాడు. తెలుగు లో మొదటిసారిగా ఆయన ‘దేవర’ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో బైరా కొడుకుగా నటించిన ఆయన, ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో జగపతి బాబు కొడుకుగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఈ చిత్రం తర్వాత తారక్ పొన్నప్ప కి టాలీవుడ్ లో మంచి ఏర్పడింది. తదుపరి రాబోతున్న పాన్ ఇండియన్ సినెమాలన్నిట్లో కూడా తారక్ పొన్నప్ప క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం ఆయన సలార్ 2 చిత్రంతో పాటు, మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇతగాడి రేంజ్ ఎలా వెళ్లబోతుందో చూడాలి. ఇతనిలో ఉన్నటువంటి సరికొత్త విలనిజం కి సంబంధించిన మ్యానరిజమ్స్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అది ఈయనకి బాగా ప్లస్ అవ్వొచ్చు.