https://oktelugu.com/

Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో పీకల్లోతు ప్రేమలో అభిషేక్ శర్మ సోదరి.. బయటపడ్డ సంచలన వీడియో.. ఇందులో నిజమెంత?

నిజం గడప దాటే లోపు.. అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుందట.. నేటి సోషల్ మీడియా యుగం మొత్తం పై దాన్నే అనుసరిస్తోంది. జరిగింది ఏంటి? దాని వెనుక ఉన్నది ఏంటి? ఎవరు ప్రేరేపించారు? కారణం ఎవరు? బాధితులు అయింది ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు అవసరం లేదు. ఎంతవరకు ఎదుటి వ్యక్తి గౌరవాన్ని హననం చేశామనే దానిపైనే మొత్తం కథ నడుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 11, 2024 / 02:47 PM IST

    Hardik Pandya

    Follow us on

    Hardik Pandya: ఆమధ్య టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. పరస్పర సమ్మతి తోనే విడిపోతున్నామని వారు ప్రకటించారు. కానీ ఈ వ్యవహారంలో కొంతమంది భూతద్దం పెట్టి చూశారు. హార్దిక్ పాండ్యా మంచోడు కాదని.. అతడు వేరే వాళ్ళతో సంబంధం లో ఉన్నాడని.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఆ జాబితాలో చాలామంది ఉన్నారని..ఇలా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందువల్లే హార్దిక్ పాండ్యా ను నటాషా దూరం పెట్టిందని.. ఎవరికి అతడు ముంబై జట్టుకు ఐపీఎల్ లో కెప్టెన్ అయినప్పటికీ అభినందించలేదని.. టి20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ శుభాకాంక్షలు తెలియజేయలేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా, నటాషాలు సెలబ్రిటీలు. వారి వ్యక్తిగత జీవితం గురించి మిగతా వారికి ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. దీన్ని కాదనడానికి కూడా లేదు. కానీ అంజనం వేసినట్టు.. భూతద్దం పెట్టి చూడటం దారుణాతీదారుణం. పైగా రకరకాల వ్యాఖ్యానాలు.. అంతకు మించిన విశ్లేషణలు.. చివరికి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకండని వారు నోట్ రాసినప్పటికీ.. నెటిజన్లు వినిపించుకోవడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు.

    ఇప్పుడు తాజాగా మరొకటి.

    హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం ముగిసిన తర్వాత ఇటీవల విహారయాత్రకు వెళ్ళాడు. అదే ప్రాంతానికి మరో మహిళా సెలబ్రిటీ కూడా వెళ్ళింది. హార్థిక్ పాండ్యా, ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పరస్పరం అనుసరించుకుంటారు. విహారయాత్రకు వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్యా ఒక ఫోటో పోస్ట్ చేయగా.. దానిని ఆ మహిళా సెలబ్రిటీ లైక్ చేసింది. అంతే ఇంకేముంది.. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని నెటిజెన్లు తీర్మానించారు. వారిద్దరు ప్రేమలో ఉన్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దీనిని మర్చిపోకముందే ఇప్పుడు అభిషేక్ శర్మ సోదరితో హార్దిక్ పాండ్యా కు లింకులు పెడుతున్నారు. వారిద్దరూ గాడ ప్రేమలో ఉన్నారని.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారని.. పైగా అభిషేక్ శర్మ సోదరికి హార్దిక్ పాండ్యా గాఢమైన ముద్దు కూడా పెట్టాడని సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో విపరీతంగా సర్కులేట్లో ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిత్వాలను ఎందుకిలా బజారుపాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోల వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయని.. ఇంతటి పైశాచిక ఆనందం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.