Samantha : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె రేంజ్ సౌత్ నుండి నార్త్ కి ఎగబాకి, ఇక్కడి కంటే అక్కడే ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన సమంత, రీసెంట్ గానే మరోసారి ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. ఈ స్పై యాక్షన్ సిరీస్ కి కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సమంత, రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రాబోయే సంవత్సరం లో తన జాతకం ఎలా ఉండబోతుందో స్టోరీ లో చెప్పుకొచ్చింది.
వృషభ, మకర, కన్య రాశి వారు వచ్చే ఏడాది జీవిత భాగస్వామి ని పొందబోతున్నారని, సంతానం ని కూడా పొందుతారని రాసుంది. అంతే కాకుండా జీవితం లో ఎంతకాలం నుండి పెట్టుకున్న లక్ష్యాలను కూడా వచ్చే ఏడాది చేరుకుంటారని, ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని, వృత్తి పరంగా మెరుగుపడుతారని ఆమె జాతకంలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మానసికంగా, శారీరకంగా దృడంగా తయారు అవుతారని, ఏడాది మొత్తం ఫుల్ బిజీ గా ఉంటారని సమంత షేర్ చేసిన స్టోరీ లో ఉంది. దీనిని చూసిన అభిమానులు ఇందులో రాసున్న విధంగా సమంత కి అన్ని జరగాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జీవిత భాగస్వామి గురించి ఆమె ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. జీవితాంతం ఇలాగే సోలోగా ఉండిపోతారా? అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం చెప్తూ, ‘అలా ఏమి లేదు..కచ్చితంగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఆమె షేర్ చేసిన స్టోరీ ని బట్టి చూస్తుంటే సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతుందా?, అభిమానులకు ఈ విషయం పరోక్షంగా తెలియాలనే ఆమె ఈ స్టోరీ పెట్టిందా అని సోషల్ మీడియా లో అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇటీవల కాలం లో సమంత ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో తో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఇక నుండి ఆమె రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు చేయనని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ తర్వాత ఆమె మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అంతే కాకుండా టాలీవుడ్ లో ఈమె రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.