Rowdy Janardhan
Rowdy Janardhan: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు వెనుకబడి పోతున్నారనే చెప్పాలి. స్టార్ హీరోల విషయం పక్కనపెడితే మీడియా రేంజ్ హీరోలు భారీ విజయాలను సాధించాలంటే మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది… ప్రేక్షకులను మెప్పించే విధంగా మంచి సినిమాలను చేసి వరుస సక్సెస్ లను సాధిస్తే ప్రతి హీరో స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉంటాయి…
Also Read: మహేష్ బాబు రాజమౌళి సినిమా రెండు పార్టులుగా రాబోతోందా..? క్లారిటీ ఇచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయన కంటు ఒక భారీ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రవి కిరణ్ డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాననే ధృడ సంకల్పంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇక ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) డైరెక్షన్ లో చేస్తున్న ‘కింగ్ డమ్’ (King dom) సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాననే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్న విజయ్ రౌడీ జనార్ధన్ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తానని చెప్తున్నాడు…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ రౌడీగా కనిపించబోతున్నాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారట. తనకి అన్యాయం చేసిన వాళ్ళను అంతమందించడానికి రౌడీగా మారతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మీడియం రేంజ్ హీరోలు అయిన నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నారు…
మరి ఈ సినిమాతో కనక విజయ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. తొందర్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ అడపాదడప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు. కానీ ఇక మీదట వచ్చే సినిమాలతో భారీ విజయాలను సాధించాలంటే మాత్రం ఆయన మంచి కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేయాలి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ గా నిలిపితే విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న హీరోగా అవతరిస్తాడు…