Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు సినిమాలను చేస్తున్నప్పటికి రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. మరి ఆయన సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో 3000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…
Also Read: హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?
పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)… ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ప్రపంచపు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రపంచ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి ఈ సినిమా కోసం అహర్నిశలు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా రెండు పార్టు లుగా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయం మీద స్పందిస్తూ ఈ సినిమా రాజమౌళి కోరిక మేరకు ఉంటే రెండు పార్టు లు ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు అంటూ ఆయన సమాధానం చెప్పాడు. అంటే రెండు పార్ట్స్ ఉంటుందా లేదా అనే విషయం మీద సరైన స్పష్టత అయితే ఇవ్వలేకపోయాడు.
కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతోంది. ఎన్ని పార్టు లుగా రాబోతుందనే విషయాలు తెలియాలంటే రాజమౌళి ఈ సినిమా మీద స్పందిస్తే తప్ప ఈ సినిమా మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ఏది చేసిన కూడా సినిమాకి హెల్ప్ అయ్యే విధంగా చేస్తాడు. తప్ప సినిమాకి డ్యామేజ్ చేసే పని అయితే చేయడనే విషయం మనందరికి తెలిసిందే. ఇక మరోసారి ఈ సినిమా విషయంలో కూడా ఆయన అదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…