https://oktelugu.com/

Dil Raju: అనిల్ రావిపూడి చిరంజీవి కి పోటీగా వస్తున్న దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రచ్చ రచ్చే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు సినిమాల మీద సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ కలెక్షన్స్ కి కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు.

Written By: , Updated On : March 10, 2025 / 10:09 AM IST
Dil Raju

Dil Raju

Follow us on

Dil Raju: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ఉండాలి. అలాంటి సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగే అవకాశాలైతే ఉంటాయి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు సినిమాల మీద సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ కలెక్షన్స్ కి కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా భారీ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారని చెప్పాలి. మరి ఇలాంటి నేపధ్యంలోనే అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే దిల్ రాజు నుంచి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి నేపధ్యంలోనే రవితేజ (Raviteja) హీరోగా, కిషోర్ తిరుమల (Kishor Thirumala) దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ఉన్నట్టుగా తెలుస్తోంది…

Also Read: మహేష్ బాబు రాజమౌళి సినిమా రెండు పార్టులుగా రాబోతోందా..? క్లారిటీ ఇచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్…

ఇక అనిల్ రావిపూడి దిల్ రాజు సినిమాల మధ్య భారీ పోటీ అయితే నెలకొనబోతుందనే వార్తలైతే వెలువడుతున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయడం విశేషం…

మరి ఇలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు నుంచి సినిమా వస్తున్న నేపథ్యంలో అది కూడా చిరంజీవి సినిమా కావడం వల్ల దిల్ రాజు ఈ సినిమాను ఢీకొట్టే ప్రయత్నం చేస్తాడా లేదంటే పండుగ సీజన్ నుంచి తప్పుకుంటాడా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి. నిజానికి దిల్ రాజు పండుగ సీజన్ ని వదిలే ప్రసక్తే లేదు. అవతలి వైపు ఏ హీరో ఉన్నా కూడా తన సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వస్తాడు.

ఎందుకంటే ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే భారీ కలెక్షన్స్ రాబడుతుందనే ఉద్దేశ్యంతో అలాగే తనకు బిజినెస్ పరంగా కూడా బాగా వర్కౌట్ అవుతుందనే నేపథ్యంలోనే ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతర సినిమాలతో పోటీ పడినప్పటికి తన సినిమాలకు వైవిధ్యమైన గుర్తింపైతే ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన తన సినిమాలను బరిలో నిలుపుతూ ఉంటాడు…