https://oktelugu.com/

Allu Arjun : ప్రశాంత్ కిషోర్ తో అల్లు అర్జున్ భేటీ.. త్వరలోనే రాజకీయాల్లోకి అరంగేట్రం..క్లారిటీ ఇచ్చిన టీం!

ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఢిల్లీ లో ఏర్పాటు చేయగా, అల్లు అర్జున్ పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆయనకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 05:41 PM IST

    Allu Arjun- Prashanth Kishor

    Follow us on

    llu Arjun :  సినీ కెరీర్ పరంగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో ఉన్నాడు. చిరంజీవి మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, అంచలంచలుగా ఎదుగుతూ, నేడు మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఆయన నటించిన ‘పుష్ప 2’ చిత్రం నిన్నటితో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని, 2000 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ ని అల్లు అర్జున్ తో పాటు, మూవీ టీం మొత్తం బాగా ఎంజాయ్ చేస్తుంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఢిల్లీ లో ఏర్పాటు చేయగా, అల్లు అర్జున్ పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆయనకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే అల్లు అర్జున్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడట. ఈ భేటీ లో అల్లు అర్జున్ తో పాటు బన్నీ వాసు, అదే విధంగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా పాల్గొన్నాడట. భవిష్యత్తులో అల్లు అర్జున్ కి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందని, అందుకోసమే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసాడని ఇలా పలు రకాల చర్చలు సోషల్ మీడియా లో చోటు చేసుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ కి పదేళ్ల పాటు సేవ కార్యక్రమాలు చెయ్యమని, ఆ తర్వాతనే రాజకీయ రంగ ప్రవేశం చెయ్యమని సలహా ఇచ్చాడట. ఈ సలహాని విన్న అల్లు అర్జున్ ఒక బ్లడ్ బ్యాంక్ కి ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.

    ఈ వార్తలన్నీ బాగా వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించింది. అయితే అల్లు అర్జున్ నంద్యాల కి తన స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి కి సపోర్టు చేయడానికి వెళ్లినప్పటి నుండి, ఆయనపై ఇలా ఎన్నో కోణాలను ఆలోచిస్తూ రకరకాలుగా రాసేస్తున్నారు. ఇక మీదట ఆయనపై అలా రాస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అనే విషయం గాసిప్ రాయుళ్లు గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇలా ఉండగా పుష్ప 2 విషయానికి వస్తే, టాలీవుడ్ వసూళ్లు రోజురోజుకి బాగా తగ్గిపోతున్నాయి కానీ, బాలీవుడ్ లో మాత్రం కళ్ళు బైర్లు కమ్మే రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.