OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈయన కూడా పాన్ ఇండియా సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమా మీద ప్రస్తుతం ఇప్పటికే ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఆయన మేనరిజమ్స్ కి, ఆయన చరిష్మాకి ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు సుజిత్ ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా తెరకేక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందట. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సాగే విధంగా ఈ సినిమా ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని సాధించాలని సుజిత్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ప్రభాస్ తో చేసిన సాహో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఓజీ సినిమాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. అయితే ఆయన గ్యాంగ్ స్టర్ గా మారడానికి గల రీజన్ ఏంటి అనేది క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్టుతో దానికి కన్ క్లూజన్ అనేది ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు అనే దాన్ని ఈ సినిమా అవుట్ లైన్ గా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో తను సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…