https://oktelugu.com/

Prakash Raj: ప్రకాష్ రాజ్ కు పోటీ ఇచ్చే నటుడు లేరా?

ప్రకాష్ రాజ్ పాత్రలను పోషించడంలో కాస్త వెనకబడ్డారు అని అంటారు. ఇలా ఆయనకు ఇప్పటికీ పోటీ ఇచ్చే నటులు లేరనే ముద్ర వేసుకున్నారు ఈ సూపర్ నటుడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 1, 2024 / 01:23 PM IST
    Follow us on

    Prakash Raj: సినిమా ఇండస్ట్రీలో కొందరు మాత్రమే ప్రతి పాత్రకు సూట్ అవుతారు. అలాంటి వారు ఇండస్ట్రీకి దొరకడం కూడా అదృష్టమే.ఇలా ప్రతి పాత్రకు న్యాయం చేసేవారు కొందరు మాత్రమే ఉంటారు. అయితే ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే ఆ నటులు చేశారు అంటే వాళ్లని రీప్లేస్ చేసేవారు కూడా ఉండరు అనేట్టుగా నటిస్తుంటారు. అలాంటి వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఏదైనా పాత్రలో ఈయన నటిస్తే.. ఈ పాత్రను ఈయన తప్ప మరెవరు చేయలేరు అనేట్టుగా ఉంటుంది.

    ఈయన చేసిన ప్రతి పాత్ర సినిమాతో సంబంధం లేకుండా సూపర్ సక్సెస్ అవుతుంది. అందుకే ప్రకాష్ రాజ్ ను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ప్రతి దర్శకనిర్మాతలు పోటీ పడుతుంటారు. అయితే గతంలో ఈయనపై బ్యాన్ విధించారు. అయినా కూడా ఈయన కోసం దర్శకులు వెయిట్ చేశారు అంటే ఆయన నటన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన చేయగలిగే పాత్రలను రిప్లేస్ చేసే నటులు ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి. అయితే రావు రమేష్ వంటి నటులు ప్రకాష్ రాజ్ ను రిప్లేజ్ చేస్తారని కొందరు అంటారు.

    కానీ ఆయన కూడా ప్రకాష్ రాజ్ పాత్రలను పోషించడంలో కాస్త వెనకబడ్డారు అని అంటారు. ఇలా ఆయనకు ఇప్పటికీ పోటీ ఇచ్చే నటులు లేరనే ముద్ర వేసుకున్నారు ఈ సూపర్ నటుడు. ముందు ముందు ఎవరైన వస్తే తప్ప ఈయన ప్లేస్ ను రిప్లేస్ చేయలేరు అంటుంటారు ఆయన అభిమానులు. అయితే ప్రకాష్ రాజ్ ఇప్పటికే అన్ని రకాల పాత్రలు పోషించారు. కాబట్టి ఇక కొత్తగా ఆయన చేసే పాత్ర కూడా ఏది లేదు. అందుకే ఇప్పటికీ చాలా మంది కొన్ని పాత్రలను చూసినప్పుడు ఇందులో ప్రకాష్ రాజ్ చేస్తే బాగుండు అంటారు.

    హీరోహీరోయిన్ లు మాత్రమే కాదు విలన్ లు కూడా అభిమానులను సంపాదించుకుంటారు అని నిరూపించారు ఈ నటుడు. అయితే ప్రకాష్ రాజ్ తండ్రి, మామయ్య, విలన్ అంటూ అన్ని పాత్రలను పోషించారు. ఇక రీసెంట్ గా రంగమార్తాండ సినిమాలో నటించి నట విశ్వరూపం చూపించారు. మొత్తం మీద ఈయనకు ఇండస్ట్రీలో పోటీ ఇచ్చే నటుడు లేరని ముద్ర వేసుకున్నారు.