https://oktelugu.com/

Soundarya: కృష్ణ వంశీ చేసిన ఆ పనికి సెట్స్ నుంచి వెళ్లిపోయిన సౌందర్య

నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించి వంశీ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 1, 2024 / 01:20 PM IST

    Soundarya

    Follow us on

    Soundarya: క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు దర్శకుడు కృష్ణ వంశీ. ఈయన చేసిన చాలా సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అంతేకాదు ఆ సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీలో ఈయనను క్రియేటివ్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. ఈయన సినిమాలు వైవిధ్యభరితంగా మాత్రమే కాదు.. ఆ సినిమాను చూస్తున్నంత సేపు బోర్ లేకుండా ఆసక్తిని పెంచేలా ఉంటాయి. అలా ఈయన మంచి పేరు సంపాదించారు.

    నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించి వంశీ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను అందించాయి. ఇలా అన్ని జానర్ లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటాడు వంశీ కృష్ణ. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, సౌందర్య లు ప్రధాన పాత్రలో వచ్చిన అంత:పురం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు ఈ డైరెక్టర్.

    ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కు చాలా అవార్డులు కూడా వచ్చాయి. అయితే కృష్ణ వంశీ సినిమాలకు మిగతా డైరెక్టర్ల సినిమాలకు తేడా ఏంటంటే.. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ జీవించేలా ఉంటుంది. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం కొన్ని విషయాల్లో రాజీ పడతారు. కానీ వంశీ అలా కాదు. ఈయన తెరకెక్కించే ఏ సినిమాలోని ఆర్టిస్ట్ అయినా ఆ పాత్రలోకి జీవించాల్సిందే అంటారు. అందుకే ఏ ఆర్టిస్ట్ అయినా కృష్ణ వంశీతో ఒక సినిమా అయినా చేయాలి అనుకుంటారు.

    అయితే అంత:పురం సినిమాలో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ సౌందర్యను కొడతాడు. అందులో ఈ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ తో సౌందర్యను నిజంగా కొట్టించాడు. దాంతో ఫీలైన సౌందర్య సెట్ నుంచి వెళ్లిపోయిందట. అయితే సీన్ నాచురల్ గా లేదని.. అందుకే అలా కొట్టమన్నాను అని వంశీ వెళ్లి సౌందర్యతో చెప్పాడట. అప్పుడు మళ్లీ సౌందర్య వచ్చి షూటింగ్ లో పాల్గొందట. మొత్తం మీద సీన్ ను నాచురల్ గా వచ్చేలా చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ ను చూసి సౌందర్య డైరెక్టర్ టాలెంట్ ను పొగిడిందట.