Sankranti Akamanam : విక్టరీ వెంకటేష్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ అతనికి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చి పెట్టాయి. కానీ గత కొద్దిరోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలేవీ పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల పట్ల చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
సంక్రాంతి కానుకగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందంటూ అనిల్ రావిపూడి ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ని కూడా చేస్తూ సినిమా మీద అంచనాలైతే పెంచుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో ఆడి పాడుతున్న వెంకటేష్ చివరికి ఈ సినిమాలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ సినిమాని కూడా చాలా కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాలో అసలు కన్ఫ్లిక్ట్ ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక కిడ్నాప్ డ్రామా కి సంబంధించిన కథగా ఇది తెరకెక్కిన కూడా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ చివరలో విలన్ గా మారబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె ఈ సినిమాలో వెంకటేష్ ఎక్స్ లవర్ గా నటిస్తుంది.
కానీ చివర్లో వెంకటేష్ దక్కలేదని ఉద్దేశ్యంతో ఆమె విలన్ గా మారి ఐశ్వర్య రాజేష్ ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన అనిల్ రావిపూడి చివర్లో అనుకోని సస్పెన్స్ ని కూడా జోడించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ని చంపడానికి ‘మీనాక్షి చౌదరి’ ప్రయత్నం చేస్తూ వస్తుందట. ఇక సినిమా చివర్లో ఈ ట్విస్ట్ ను రివిల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఫన్ తో ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికే ట్రైలర్ తో ప్రేక్షకులందరికి తెలిసేలా చేశాడు.
మరి ఈ సినిమాలో వెంకటేష్ తన మార్క్ ను మరొకసారి అందుకోబోతున్నాడు. తద్వారా ఇక మీదట చేయబోయే సినిమాల కంటే కూడా ఈ సినిమా చాలా కొత్తదనాన్ని అందించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది తెలియాలంటే మాత్రం మరో 4 రోజులు వెయిట్ చేయాల్సిందే…