https://oktelugu.com/

Akkineni Family : అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి మరో సినిమా చేస్తున్నారా..?ఇంతకీ ఇందులో కొత్త కోడలు కూడా ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీ లో నాగార్జునకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు...ప్రస్తుతం విలన్ గా చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 10:17 PM IST

    Akkineni Family

    Follow us on

    Akkineni Family : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరు కలిసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్ ను తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లిన వారిలో వీళ్ళిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే వీళ్లిద్దరిని ఇండస్ట్రీకి రెండు కండ్లు గా అభివర్ణిస్తూ ఉంటారు.

    ఇక మొత్తానికైతే వీళ్ళ తర్వాత వీళ్ళ వారసులు కూడా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసిన ‘మనం ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. నిజానికి నాగేశ్వరరావు కి చివరి క్షణంలో ఇచ్చిన అత్యంత అద్భుతమైన అనుభూతి ఏదైనా ఉంది అంటే అది మనం సినిమా అనే చెప్పాలి.

    ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించడమే దానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు… ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరోసారి అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమాలో నటించడానికి సన్నాహలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా మనం కి సీక్వెల్ గా వస్తుందా? లేదంటే ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన ఒక కథ ద్వారా నాగార్జున ఈ సినిమా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘మనం’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్న శోభిత కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సమంత వీళ్ళ కోడలు కాకముందు మనం సినిమా చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఇప్పుడు శోభితతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత మరోసారి ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమాలో నటించాలని అంటుకుంటున్నారు.

    ఆ విధంగానే నిర్ణయం తీసుకొని ముందుకు అడుగులు వేయడం అనేది కూడా ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎంటైర్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఆ క్రేజ్ ను మరింత బలోపేతం చేయడానికి నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది…