Divya vani : హీరోయిన్స్ బాడీ, అందానికి మందులు వాడుతారని చాలా మంది అనడం వింటుంటాం. అందంగా ఉండాలని, తెల్లగా కావాలని, మంచి ఫిజిక్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజుల్లో అయితే టెక్నాలజీ మారిపోవడంతో ముఖంలో ఏ చిన్నది నచ్చకపోయిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఆఖరికి జెండర్ ఆపరేషన్ లు కూడా చేయించుకుంటున్నారు. అయితే హీరోయిన్స్ ఇలా అన్నిటికి మందులు వాడటం లేదా ఆ నిమిషానికి అందంగా కనిపించాలని కొన్ని పద్ధతులు పాటిస్తారు. సినిమాల్లో ఫిజిక్ బాగా కనపడాలని కొందరు హీరోయిన్లు కొన్ని ఆర్టిఫిషల్ వస్తువులని వాడుతారని ఓ సీనియర్ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సంచలన విషయాలు బయటపెట్టింది. ఇంతకీ ఆ నటి ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పెళ్లి పుస్తకం సినిమాతో బాగా పాపులర్ అయిన నటి దివ్య వాణి. ఈ సినిమాతో దివ్య వాణికి తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వచ్చింది. తన అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆశించినంత హిట్ రాకపోవడంతో.. కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పెళ్లి పుస్తకం సినిమా గురించి మాట్లాడారు. బాపు గారు అంటే అందరికీ గుర్తువచ్చేది పెళ్లి పుస్తకం.. పెళ్లి పుస్తకం అంటే బాపు గారు అని ఆమె అన్నారు. ఈ సినిమా హిట్ కావడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని.. బాపు బొమ్మ అనేది ఇంటి పేరులా మారిపోయిందని ఆమె అన్నారు. నేను ఎప్పటికీ బాపూగారికి రుణపడి ఉంటానని ఇంటర్వ్యూ లో తెలిపారు. తన నుంచి ఏం ఆశించకుండా.. తనకి హీరోయిన్ అవకాశం ఇచ్చారు. నా కష్ట సుఖాల్లో కూడా అతను నాకు తండ్రిలాగా ఉన్నారని ఆమె అన్నారు. వాళ్ల కుటుంబంతో తనకి విడదీయారని బంధం ఉందని తెలిపారు. అతనిని తండ్రిలా అనుకుని ఆమె ఉత్తరాలు కూడా రాసేవారని ఆమె ఇంటర్వ్యూ లో తెలిపారు.
ఇలా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. దివ్య వాణి సినిమా హీరోయిన్ల గురించి సంచలన విషయాలు బయటికి చెప్పారు. అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని డ్రెస్ వేసుకున్నప్పుడు పాడ్స్ వాడే వాళ్లు అని ఆమె తెలిపారు. బాడీ షాప్స్ కోసం ఇలాంటివి చేసేవాళ్లు అని ఆమె అన్నారు. అలాగే జుట్టు కోసం విగ్గు వాడేవారు అని ఆమె అన్నరు. ఆమె ఎప్పుడు ఎలాంటివి వాడలేదని.. ఫిటినెస్ కోసం యోగా, వ్యాయామం, స్విమ్మింగ్ వంటివి చేసేవారని ఆమె అన్నారు. జుట్టుకి కూడా కుంకుడుకాయ వంటివి ఉపయోగిస్తానని ఆమె తెలిపారు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయని ఆమె అన్నారు. బాపు బొమ్మ అంటే అందం, విధేయత అన్ని ఉంటేనే అంటరాని ఆమె తెలిపారు.