Older Prabhas scenes: నేడు విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం అభిమానులను అన్ని విధాలుగా నిరాశకు గురి చేసింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ని ఎనర్జిటిక్ రోల్ లో చూసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త సంతృప్తి చెందినప్పటికీ, డైరెక్టర్ గా మారుతి టేకింగ్ విషయం లో పూర్తిగా విఫలం అవ్వడం తో, ప్రభాస్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మొదటి నుండి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా థ్రిల్ కి గురి చేసిన అంశం, ప్రభాస్ ‘రాజా సాబ్’ గెటప్ లో కనిపించడమే. రాజు గెటప్ లో కాస్త ముసలి వాడిగా కనిపిస్తూ, నోట్లో సిగార్ పెట్టుకొని, స్టైల్ గా ప్రభాస్ కనిపించే షాట్స్ టీజర్ లో, ట్రైలర్ లో బాగా హైలైట్ అయ్యాయి. అదే విధంగా రిలీజ్ ట్రైలర్ లో కూడా ఈ షాట్స్ ని బాగా చూపించాడు డైరెక్టర్ మారుతీ.
కానీ ఈ గెటప్ కి సంబంధించి ఒక్క షాట్ ని కూడా సినిమాలో చూపించలేదు డైరెక్టర్. ఇది మామూలు మోసం కాదు బాబోయ్. ఫ్యాన్స్ ఈ విషయం లో డైరెక్టర్ మారుతీ పై పీకల్లోతు కోపం తో ఉన్నారు. ‘రాజా సాబ్’ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ఆ గెటప్ ని ఎందుకు సినిమా నుండి తొలగించారు?, అంత అవసరం ఏమొచ్చింది? అంటూ నిలదీస్తున్నారు. అయితే సినిమాలో ఈ సన్నివేశాలు కథ ఫ్లో కి అడ్డుగా ఉన్నాయని, అతికించినట్టుగా ఆ సన్నివేశాలు అనిపించడం వల్లే వాటిని తొలగించాల్సి వచ్చిందని ఈ సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ బాగా వచ్చేసింది కదా , ఈ సన్నివేశాలు సినిమాలో జత చేస్తే కచ్చితంగా అభిమానులు రిపీట్స్ లో పండగకు థియేటర్స్ కి వచ్చి చూస్తారు, కాబట్టి ఈ సన్నివేశాలను యాడ్ చేయండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
సినిమా మొత్తం ఫిల్లర్ సన్నివేశాలే ఉన్నాయి, కథకు అడ్డు వచ్చే సీన్స్ బోలెడన్ని ఉన్నాయి, కావాలంటే వాటిని తొలగించి, ఈ గెటప్ లో ఉన్న సన్నివేశాలను యాడ్ చేయమనే డిమాండ్ అభిమానుల నుండి బలంగా ఉంది. మరి ఈ డిమాండ్ ని మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి. ఇకపోతే నేడు విడుదలైన ‘రాజా సాబ్’ చిత్రానికి ఓపెనింగ్స్ వసూళ్లు నైజాం ప్రాంతం వరకు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి కానీ , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే, త్వరలోనే రాబోయే చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే , రాజా సాబ్ పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.