Highest Gross Premiere Shows: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం నుండి మన టాలీవుడ్ లో ప్రీమియర్ షోస్ జోరు ఊపందుకుంది. స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాల నుండి స్పెషల్ గా టికెట్ రేట్స్ ని పెంచుకునేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ‘పుష్ప 2’ తర్వాత వెంటనే విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రీమియర్ షోస్ కి బదులుగా మిడ్ నైట్ షోస్ వేసుకున్నారు. ‘గేమ్ చేంజర్’ తర్వాత విడుదలైన ప్రతీ పెద్ద హీరో సినిమాకు ప్రీమియర్ షోస్ వేసుకున్నారు. నిన్న రాజా సాబ్(The Rajasaab Movie) కి కూడా ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ ప్రీమియర్ షోస్ ట్రెండ్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
ఓజీ(They Call Him OG):
భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయం లో ప్రభంజనం సృష్టించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 31.25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి 11 కోట్ల 10 లక్షలు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్ల 50 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 12 కోట్లు, కర్ణాటక ప్రాంతం నుండి 2 కోట్ల 75 లక్షలు , రెస్ట్ ఆ ఇండియా (సౌత్) నుండి 50 లక్షలు, నార్త్ నుండి 40 లక్షలు వచ్చాయి.
హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu):
పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిల్చిన ఈ చిత్రం కూడా ప్రీమియర్స్ నుండి మంచి గ్రాస్ ని రాబట్టింది. ప్రస్తుతం ఇండియా వైడ్ గా రెండవ స్థానం లో కొనసాగుతున్న ఈ సినిమాకు 19 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి 5 కోట్ల 10 లక్షలు, సీడెడ్ నుండి 3 కోట్ల 7 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 9 కోట్ల 50 లక్షలు, కర్ణాటక నుండి 1 కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
పుష్ప 2 ది రూల్:
గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడుమ విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాంగ్ రన్ కలెక్షన్స్ లోనే కాదు, ప్రీమియర్స్ లో కూడా గత ఈఏడాది ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూసి షాక్ కి గురయ్యారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా 16 కోట్ల 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడవ స్థానం లో కొనసాగుతుంది. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి 4 కోట్లు, సీడెడ్ నుండి 3 కోట్ల 50 లక్షలు, ఆంధ్రా నుండి 6 కోట్లు, కర్ణాటక నుండి 2 కోట్ల 62 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
రాజాసాబ్:
ఇక నాల్గవ స్థానం లో నిన్న విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం కొనసాగుతోంది. ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వాస్తవానికి ఈ చిత్రానికి మూడవ స్థానం లో ఉండాల్సింది. కానీ ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడంతో సాధారణ టికెట్ రేట్స్ తోనే ప్రీమియర్స్ వేయాల్సి వచ్చింది. ఆ టికెట్ రేట్స్ ద్వారా కేవలం 52 లక్షల గ్రాస్ మాత్రమే నైజాం నుండి వచ్చింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్+ సీడెడ్ నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ ఇండియా వైడ్ గా 10 కోట్లు వచ్చాయి.
అఖండ 2(Akhanda 2 Movie) :
గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, ప్రీమియర్స్ వరకు పర్వాలేదు అనిపించే రేంజ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు ఇండియా వైడ్ గా 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీడెడ్ నుండి 2 కోట్ల 30 లక్షలు, ఆంధ్రా నుండి 3 కోట్ల 10 లక్షలు, కర్ణాటక నుండి కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.