Naveen Polishetty Pawan Kalyan: సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సంక్రాంతి సంబరాలను తన నియోజకవర్గం పిఠాపురం లో జరుపుకుంటున్నాడు. నేటి నుండి మూడు రోజుల పాటు ఆయన పిఠాపురంలో ఉండబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నాడు. అయితే ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సినిమాల్లో ఒకటైన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ టీం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో తమ సినిమాని ప్రమోట్ చేసుకోబోతుంది. సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) కూడా పాల్గొనబోతున్నాడట. ఈమేరకు ఆయన పిఠాపురం కి బయలుదేరేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఈ సినిమా పై బజ్ మామూలు రేంజ్ లో క్రియేట్ అవ్వదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విడంలో నవీన్ పోలిశెట్టి స్టైల్ వేరే.
చాలా డిఫరెంట్ పద్ధతుల్లో జనాల్లోకి వెళ్తూ ప్రొమోషన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు అలా తన సినిమా ప్రొమోషన్స్ లో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాగం అయ్యేలా చేయబోతున్నాడు. ఇది కచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రొమోషన్స్ అనే చెప్పాలి. నవీన్ పోలిశెట్టి తో పాటు మీనాక్షి చౌదరి కూడా ఈ సంబరాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈమెకు పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో కూడా ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా పిఠాపురం కి వెళ్లి పవన్ కళ్యాణ్ తో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది కచ్చితంగా ఆమెకు సరికొత్త అనుభూతిని అందించే విషయం అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
సంక్రాంతి పండుగకు, సరైన సంక్రాంతి వైబ్స్ ఉన్న సినిమా అని ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు, డైలాగ్స్ కూడా బాగా పేలాయని , కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే కల కనిపిస్తుందని అంటున్నారు. ఈరోజు విడుదలైన ‘రాజా సాబ్’ చిత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. మరో మూడు రోజుల్లో రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో తెలియదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినా, ‘అనగనగా ఒక రాజు’ కి కూడా పాజిటివ్ టాక్ వస్తే, కచ్చితంగా ఈ పండగకు ఆడియన్స్ కి రెండవ ఛాయస్ గా నవీన్ పోలిశెట్టి సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.