RK Roja: మాజీ మంత్రి రోజా పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్ గా చెలరేగారు. ప్రతిపక్ష పార్టీ నేతల మీద విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి కాని చెల్లిగా ఆయన మీద స్వామి భక్తి చూపించింది. వైఎస్ జగన్ పై ఆమె ఒక్క మాట పడనిచ్చేది కాదు. వైఎస్ జగన్ విమర్శించిన వారి మీద పరుష పదజాలంతో విరుచుకుపడేది. ఆమె వీర భక్తికి మెచ్చి వైఎస్ జగన్ అదే స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చాడు. మొదటి మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు ఛాన్స్ దక్కలేదు.
సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి కాలేకపోయారు. దాంతో ఏపీఐఐసీ చైర్పర్సన్ గా ఆమెను నియమించారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మంత్రి కావాలన్న ఆమె కల నెరవేరింది. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మంత్రి అయ్యాక ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారనే వాదన ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రూ. 100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
నాసిరకం స్పోర్ట్స్ కిట్స్ అధిక ధరకు కొనుగోలు చేశారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టనుంది. పలువురు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొనే అవకాశం కాలేదు. రోజా-బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో రోజా, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కాలేదంటున్నారు.
మరి అదే జరిగే రోజాకు పరిశ్రమ నుండి బహిష్కరణ తప్పదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రిమినల్, కరప్షన్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటి హేమను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో టాలీవుడ్ వైసీపీ నేతలకు పూర్తి వ్యతిరేకం. వైసీపీ తరపున ప్రచారం చేసిన యాంకర్ శ్యామల ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెను పక్కనే పెట్టేశారని సమాచారం. కాబట్టి టాలీవుడ్ లో రోజాకు ఎలాంటి అవకాశాలు రావు. బుల్లితెర పరిశ్రమ కూడా ఆమెను బహిష్కరించే అవకాశం కలదు. మొత్తంగా రోజా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది..