Indian weddings: మన దేశంలో చాలా మంది చదువుకన్నా పెళ్లిళ్లకే రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. వివాహం జీవితంలో ముఖ్యమైన ఘట్టమే. కానీ, కొంతకాలంగా దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి మొదలు కుని పెళ్లి తర్వాత జరిగే వివిధ కార్యక్రమాల వరకు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెడుతున్నారు. మేరకు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తమ సర్వేలో గుర్తించింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేసింది. ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లి ఖర్చే ఎక్కువగా చేస్తున్నట్లు జెఫరీస్ వెల్లడించింది.
ఏటా కోటి పెళ్లిళ్లు…
భారత మార్కెట్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతాయని సర్వే సంస్థ అంచనా వేసింది. చైనాలో 70 లక్షల నుంచి 80 లక్షల పెళ్లిళ్లు, అమెరికాలో 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతాయని జెఫరీస్ సంస్థ వివరించింది. అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ రెండింతలు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. వివాహాలను ప్రత్యేక రీటైల్ కేటరిరీలుగా వర్గీకరిస్తే.. ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని వెల్లడించింది.
ఆడంబరాలకే అధిక ఖర్చు..
మన దేశంలో వివాహాలను ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. సంస్కృతి, సంప్రదాయాల పేరిట వివిధ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇటీవల ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్‌తోపాటు అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. దుస్తులు, ఆభరణాల వంటి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకూ భారీగా ఖర్చు చేస్తున్నారు. చాలా మంది పెళ్లిని ప్రతిష్టాత్మకంగా భావించి తమ తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారని జెఫరీస్ నివేదిక వెల్లడించింది.
ఒక పెళ్లికి రూ.12.50 లక్షల ఖర్చు..
భారత దేశంలో సగటున ఒక పెళ్లికి రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఆర్థిక స్తోమతను బట్టి ఈ ఖర్చు ఇంకా పెరుగతుందని పేర్కొంది. ఒక్కో పెళ్లికి చదువు కన్నా రెండింతలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాలో విద్యకు చేసే ఖర్చుతో పోలిస్తే.. పెళ్లికి చేసే ఖర్చు అందులో సగమేనని తెలిపింది.
ప్రపంచంలోనే ఎక్కువ ఖర్చు..
ఇక అంతర్జాతీయంగా పోలిస్తే భారతీయ వివాహాలకు ఖరీదైన ప్రదేశాలు వేదికగా, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలు, ఆడంబరాలు జరుగుతాయని జెఫరీస్ నివేదిక తెలిపింది. దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పంజుకుంటాయని పేర్కొంది. దేశంలో ఏటా కొనుగోలు చేసే ఆభరణాల్లో సంగం పెళ్లిళ్ల కోసమే చేస్తారని తెలిపింది. దుస్తుల అమ్మకాల్లో 10 శాతం వివాహాలకే వివాహాలే అని పేర్కొంది. పెళ్లి కోసం ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారని గరిష్టంగా 50 వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది.