https://oktelugu.com/

Harish Shankar : హీరోయిన్ తో అసభ్యంగా.. అక్కడ చేయి పెట్టిన రవితేజ.. ఐడియా ఎవరిదో చెప్పిన హరీశ్ శంకర్

హరీష్ శంకర్ మూవీ టీం కలిసి సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు 'సితార్' సాంగ్ లో వచ్చే ఆ అసభ్యకరమైన స్టెప్పు గురించి హరీష్ శంకర్ ని అడుగుతారు. దానికి హరీష్ శంకర్ సమాధానం చెప్తూ 'నాకు కూడా ఆ స్టెప్ చాలా అసభ్యకరంగా అనిపించింది.

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 / 08:10 AM IST

    Harish shankar reaction

    Follow us on

    Harish Shankar :  భారీ అంచనాల నడుమ నేడు రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ చిత్రం విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం నేషనల్ హాలిడే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సాధారణంగా ఈ తేదీన ఎంత చెత్త సినిమా అయినా ప్రతీ సెంటర్ లోనూ హౌస్ ఫుల్ బోర్డు పడుతుంది. కానీ మిస్టర్ బచ్చన్ కి పడలేదు. ఇది నిజంగా ట్రేడ్ కి పెద్ద షాక్. రవితేజ కెరీర్ లోనే ఈ చిత్రానికి డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. అంతే కాకుండా ఈ సినిమాలో హరీష్ రాసిన వల్గర్ డైలాగ్స్, హీరోయిన్ తో హీరో వేసిన వెక్కిలి డ్యాన్స్, ఆమె నడుము క్రింది భాగం లో అసభ్యంగా హీరో చెయ్యి పెట్టడం వంటి వాటిపై సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన విమర్శలు ఎదురు అవుతున్నాయి.

    ఇకపోతే నేడు సాయంత్రం హరీష్ శంకర్ మూవీ టీం కలిసి సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు ‘సితార్’ సాంగ్ లో వచ్చే ఆ అసభ్యకరమైన స్టెప్పు గురించి హరీష్ శంకర్ ని అడుగుతారు. దానికి హరీష్ శంకర్ సమాధానం చెప్తూ ‘నాకు కూడా ఆ స్టెప్ చాలా అసభ్యకరంగా అనిపించింది. కానీ ఆ పాటకి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కి అదే మొదటి రోజు. మొదటి రోజే ఆ స్టెప్పు బాగాలేదు, తీసేయండి అంటే ఆయన ఫీల్ అవుతాడనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. కానీ పాట చూసినప్పుడు ఎవరికీ ఇబ్బందిగా అనిపించదు. కానీ స్క్రీన్ షాట్ తీసి బూతద్దంలో చూస్తే కచ్చితంగా ఇబ్బందిగా అనిపిస్తాది’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ మాట్లాడిన ఈ మాటలకు సోషల్ మీడియా లో ఆయనపై నెగటివిటీ ఇంకా పెరిగిపోయింది.

    పాజిటివ్ రెస్పాన్స్ వస్తే క్రెడిట్ నువ్వే తీసుకుంటావు, దేనికైనా నెగటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తావా..?, కొరియోగ్రాఫర్లు డైరెక్టర్ల మాట కాదని ఏమైనా చేసేస్తారా..?, మనసుకి అనిపించింది నిర్మొహమాటంగా చెప్పేస్తాను, నాకు ఎలాంటి భయం లేదు అంటూ చెప్పుకొచ్చే హరీష్ శంకర్ కోట్లాది మంది చూసే సినిమా విషయం లో ఇలాంటి తప్పులు జరిగితే చెప్పే ధైర్యం లేదా?, అనవసరంగా శేఖర్ మాస్టర్ ని గెలికేసావ్,రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీ మీద విరుచుకుపడితే ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుంది జాగ్రత్త అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా అన్నీ ప్రాంతాలలో మొదటి ఆట నుండే వీక్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమాకి సాయంత్రమే సక్సెస్ మీట్ పెట్టడం ఏంటో అని రవితేజ అభిమానులు సైతం హరీష్ పై మండిపడుతున్నారు.