Sukumar and Ram Charan : తెలుగు సినిమా దర్శకులలో సుకుమార్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన చేసిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వీళ్ళ కాంబోలో ఇంతకుముందు ‘రంగస్థలం ‘ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టడంతో వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సుకుమార్ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయడం పట్ల మెగా అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులకు ఆశించిన మేరకు సంతోషానైతే కలిగించలేదు. దాంతో ఈ సినిమా పోతే పోయింది కానీ తదుపరి రాబోయే బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందిస్తానని ఇప్పటికే రామ్ చరణ్ తమ అభిమానులకు మాటిచ్చారు. ఇక తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా తద్వారా ఆయన కంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి తన తోటి హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన మాత్రం చాలావరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరిదిలా ఉంటే సుకుమార్ తో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో ఒక స్ప్లిట్ పర్శనిలిటీ డిసీజ్ తో కనిపించబోతున్నాడట…
ఇక ఇప్పటికే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ను చెవిటి వాడిగా చూపించి సూపర్ సక్సెస్ ని అందుకున్న సుకుమార్ ఈ సినిమాలో అతన్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి మరోసారి మరో సూపర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి రామ్ చరణ్ కూడా ఒప్పుకున్నారట.
ఎప్పుడైనా సరే రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో నత్తివాడిగా నటించి తనలో నటన ప్రతిభను బయటి ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాడు. తద్వారా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపైతే వచ్చింది. కానీ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ ని సాధించకపోవడం అనేది కొంతవరకు మైనస్ గా మారిందనే చెప్పాలి…