Sankranti Ainyaam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకులు ఎంతమంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. నిజానికి అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకు వచ్చి పెడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతి దర్శకుడు ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు అయిన అనిల్ రావిపూడి సైతం ఈ సినిమాకి సీక్వెల్ ని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సీక్వెల్ కి సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బయట చక్కర్లు కొడుతుంది. నిజానికి సీక్వెల్ సినిమాని కొంచెం ఎమోషనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో తను ఉన్నాడట. ఇక ఎమోషనల్ డ్రామాగా ఈ సీక్వెల్ ను మలచాలనే ప్రయత్నం చేస్తున్నారట.
అయితే ప్రస్తుతం ఆయన చిరంజీవితో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్ ని తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నా అనిల్ రావిపూడి మరోసారి కమర్షియల్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకోవడం విశేషం…
ఇక ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి ప్రాంఛైజ్ లను సక్సెస్ ఫుల్ గా తీసిన ఆయన ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాకి సీక్వెల్ ని కూడా అలాగే సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చిరంజీవితో చేయబోతున్న సినిమాని సక్సెస్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు పెను సవాల్ గా మారింది.
ఇక ఇప్పటివరకు ఎక్కడ తడబడకుండా ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా అంత మంచి విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా మెగా అభిమానులు సైతం ఈ దర్శకుడి మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. మరి వాటన్నింటికి ఈ సినిమా సక్సెస్ తో సమాధానం చెబుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…