https://oktelugu.com/

Suma : అక్షారాలా 278 కోట్లు..కేరళలో యాంకర్ సుమ ప్రభంజనం..స్టార్ హీరోలకు కూడా ఇంత సాధ్యం కాదేమో!

సినీ ఇండస్ట్రీ లోని ప్రతీ క్రాఫ్ట్ లో 'ఓజీ' లు ఉంటారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్..అంటే నెంబర్ 1, వాళ్ళని మించిన తోపులు, తురుములు లేరని అర్థం.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 03:12 PM IST

    Suma

    Follow us on

    Suma : సినీ ఇండస్ట్రీ లోని ప్రతీ క్రాఫ్ట్ లో ‘ఓజీ’ లు ఉంటారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్..అంటే నెంబర్ 1, వాళ్ళని మించిన తోపులు, తురుములు లేరని అర్థం. అలా యాంకరింగ్ రంగం లో ఓజీ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమ కనకాల. ఈమె మన చిన్న తనం యాంకరింగ్ చేస్తూనే ఉంది. చిన్నప్పుడు మనం చూసినప్పుడు ఈమె ఎలా ఉండేదో, ఇప్పటికీ అలాగే ఉంది. ఈమెతో పాటు కెరీర్ ని ప్రారంభించిన యాంకర్స్ అందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ సుమ మాత్రం ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. మధ్యలో ఎంతో అందంగా ఉండే యాంకర్స్ ఇండస్ట్రీ లోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు కానీ, వాళ్ళ వల్ల సుమారు పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటికీ స్టార్ హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమనే యాంకర్ గా వ్యవహరిస్తోంది.

    ఎంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినా, డైరెక్టర్ అయినా తమ సినిమాలు విడుదలకు ముందు సుమ తో ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న ఎవర్గ్రీన్ స్టార్ యాంకర్ ఈమె. ఇంత పెద్ద స్థాయిని ఎంజాయ్ చేస్తున్న సుమ సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో అని పతీ ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే రీసెంట్ గానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమ కనకాల కి కేరళలో 278 కోట్ల రూపాయిల విలువ చేసే ఇల్లు ఉందని, ఆ ఇంటికి 500 టీవీ కెమెరాలు, పదుల సంఖ్యలో పని మనుషులు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. కేవలం యాంకరింగ్ ద్వారా సుమ ఇంతలా సంపాదించిందా అని చర్చించుకున్నారు.

    వీడియో బాగా వైరల్ అవ్వడం తో సుమ వరకు చేరింది. ఆమె దీనిపై స్పందిస్తూ ‘ఇవ్వరా మీరంతా..ఎక్కడుంటారు అసలు..నేను కేరళలో 278 కోట్ల రూపాయిలు పెట్టి ఇల్లు కట్టించానా?, అది కూడా 2018 వ సంవత్సరంలో?..అసలు 278 కోట్ల రూపాయలకు ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పమ్మా నువ్వు?..నేనేమైన అంబానీ కుటుంబానికి చెందిన అమ్మాయిని అనుకుంటున్నావా తల్లి నువ్వు?, ఒక ఇంటికి 500 సీసీటీవీ కెమెరాలా?, ఒక ఇంట్లో 5 గదులు ఉంటే, ఒక్కో గదికి 5 కెమెరాలు పెట్టినా 25 మాత్రమే వస్తాయి. 500 సీసీటీవీ కెమెరాలు ఏ తలకమాసినోడు పెడుతారండి?, అది హౌస్ అనుకున్నారా, లేదా బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా?, నన్ను అనుసరించే అభిమానులు దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి. ఈమధ్య AI ని ఉపయోగించి నేను ఎక్కడో థాయ్ ల్యాండ్ లో ఉన్నట్టు, గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో తిప్పారు. కేవలం మేము మా నోటి నుండి చెప్పినవి మాత్రమే నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చింది.