https://oktelugu.com/

Srikanth Odela : శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథను అల్లు అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాని మరొకరు చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 11:02 AM IST

    Srikanth Odela

    Follow us on

    Srikanth Odela : సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాని మరొకరు చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే స్టార్ హీరోలుగా ఉన్న కొంతమంది వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు మంచి కథ దొరికితే చిన్న దర్శకులతో సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాళ్ళ ఇమేజ్ కి సరిపడా కథ దొరకాకపోతే మాత్రం పెద్ద డైరెక్టర్లతో కూడా సినిమాలను రిజెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుంచి పుష్ప సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ కూడా సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాలకు ఒక సపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది. స్టైలిష్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో తనదైన రీతిలో ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే అర్జున్ తో శ్రీకాంత్ ఓదెల ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాను అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఏంటి అంటే ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో వస్తున్న ప్యారడైజ్ సినిమా కథని మొదట అల్లు అర్జున్ కి వినిపించారట.

    ఇక శ్రీకాంత్ దసర సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మాస్ ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి విజయాన్ని సాధించి అతనికి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ప్యారడైజ్ సినిమా కథని అల్లు అర్జున్ కి చెప్పినప్పుడు ఆయనకు కూడా కథ బాగా నచ్చిందట. కానీ అంత పెద్ద స్టోరీని హ్యాండిల్ చేయగలడా లేదా అనే ఉద్దేశ్యంతోనే తను ఆ కథను వదిలేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని నానితోనే తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా మరొక సినిమాలో చేయబోతున్నాడు.

    అయితే అది కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాగా రానున్న నేపధ్యంలో నానితో చేయబోయే సినిమాని భారీ సక్సెస్ గా నిలిపి చిరంజీవి సినిమాని అంతకుమించినా అంచనాలతో స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో శ్రీకాంత్ ఓదెల ఉన్నట్లుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు…