Prabhas: అనిమల్ సినిమా ప్రభాస్ కటౌట్ కి సెట్ అయ్యేదా..?

సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ ని చూసిన తర్వాత చాలామంది సందీప్ రెడ్డి వంగ తీసిన అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ కంటే కూడా ప్రభాస్ ని పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

Written By: Gopi, Updated On : December 28, 2023 4:30 pm

Prabhas

Follow us on

Prabhas: డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుతూ సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా వాళ్లకంటూ మంచి క్రేజ్ ని కూడా సంపాదించి పెట్టాయి అవి ఏ సినిమాలు అంటే రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రస్తుతం 600 కోట్లకు పైన కలక్షన్స్ ని రాబట్టి 1000 కోట్లు సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…

ఇక ఇప్పుడు సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ ని చూసిన తర్వాత చాలామంది సందీప్ రెడ్డి వంగ తీసిన అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ కంటే కూడా ప్రభాస్ ని పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా హైలైట్ గా నిలిచేవి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. నిజానికి అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ చాలా బాగా సెట్ అయ్యాడు.సలార్ సినిమాలో ప్రభాస్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూసిన చాలా మంది ప్రేక్షకులు అనిమల్ సినిమాలో కూడా ప్రభాస్ ఉంటే ఆ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేది అంటూ సోషల్ మీడియా వేదిక గా ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా చూసిన డైరెక్షన్ పరంగా చూసిన చాలా మంచి సినిమాలు అందుకే ఆ సినిమాల్లో హీరోల నటన కూడా చాలా బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమాతో అనిమల్ ని మించిన సినిమా తీస్తాను అని ఇప్పటి నుంచే ప్రభాస్ అభిమానులకి హామీ ఇస్తున్నాడు. ఇక అనిమల్ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు స్పిరిట్ సినిమా ఎందుకన్నా అనిమల్ సినిమానే ప్రభాస్ తో చేసి ఉంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు…

నిజానికి అనిమల్ సినిమాలో ప్రభాస్ చేసిన కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఆ సినిమా చాలా బాగా సెట్ అయ్యేది. ప్రభాస్ కటౌట్ కి అనిమల్ లో గొడ్డలితో నరికే షాట్స్ గాని, మిషన్ గన్ తో పేల్చే సీన్స్ కానీ చాలా హైలెట్ గా నిలిచేవి అంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…