https://oktelugu.com/

Raghavendra Rao On Rajamouli: ఆ ఒక్క సీన్ చేసి చూపించు అని రాజమౌళి కి సవాల్ విసిరిన రాఘవేంద్రరావు…

రాజమౌళి అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కి కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2023 / 04:25 PM IST

    Raghavendra Rao On Rajamouli

    Follow us on

    Raghavendra Rao On Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి సాదించిన ఘనత గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన ఆయన ప్రయాణం పాన్ ఇండియా రేంజ్ వరకు వెళ్లింది.ఇండియా వైడ్ గా తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

    ప్రస్తుతం పాన్ ఇండియాలో తనొక స్టార్ డైరెక్టర్. అలాగే ఇప్పటివరకు ఎవరు సాధించలేని రికార్డులను కూడా తను సాధించి చూపించాడు.ఇక ఈరోజు మనమందరం గర్వంగా చెప్పుకునే పాన్ ఇండియా సినిమాని చాలా మంది ట్రై చేసి అది మనవల్ల కాదు అది అసాధ్యం అని అనుకున్నారు, కానీ అలాంటి అసాధ్యాలను సాధ్యం చేసి చూపించిన ఒకే ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి…

    అందుకే రాజమౌళి అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కి కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి డైరెక్టర్ అవ్వక ముందు రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాడు. అయితే రాఘవేంద్ర రావు ఒక సినిమాని డైరెక్షన్ చేస్తున్న సమయంలో రాజమౌళి ఒక విషయం పట్ల రాఘవేంద్రరావు గారితో డిస్కస్ చేశాడట అది ఏంటి అంటే ఒక సీన్ లో డైలాగ్స్ ఏం వాడకుండా మనం ఆ నటుడి ఎక్స్ ప్రెషన్స్ ని మనం ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టుకోవచ్చు కదా సార్ అని రాఘవేంద్రరావుని అడగగా అప్పుడు రాఘవేందర్రావు ఆర్టిస్టుల దగ్గర దమ్ముంటే మాట మాట్లాడకపోయిన ప్రేక్షకుడి కండ్లల్లో నుంచి కన్నీళ్లు పెట్టించచ్చు కానీ దానికి డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్త చేయించుకోవాలి కొంచం తేడా కొట్టిన కూడా ఎమోషనల్ సీన్ కాస్త కామెడీ సీన్ అయిపోతుంది అని సమాధానం చెప్పి నువ్వు చేసే సినిమాల్లో ఇలా చేసి చూపించు అని రాఘవేంద్ర రావు ఒక సవాల్ విసిరాడు.

    దాంతో రాజమౌళి చేసిన మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో అలాంటి ఒక సీన్ డిజైన్ చేసుకొని దాన్ని సక్సెస్ ఫుల్ గా చేసి చూపించాడు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళ నాన్నకి మధ్య వచ్చే ఒక ఎమోషనల్ సీన్ లో కొద్దిసేపు ఇద్దరి మధ్య డైలాగులు ఏమీ లేకపోయిన కూడా ఎన్టీఆర్ తన ఎక్స్ ప్రేషన్స్ తో ఆడియన్స్ ని ఏడిపిస్తాడు ఆ సీన్ చేయించడానికి రాజమౌళి ఎన్టీఆర్ కి స్పెషల్ గా వన్ డే కేటాయించి అది ప్రాక్టీస్ చేయించినట్టు గా కూడా తెలుస్తుంది… మొత్తానికైతే వాళ్ల గురువు ఇచ్చిన టాస్క్ ని రాజమౌళి సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాడనే చెప్పాలి…ఇక దాంతో రాఘవేంద్ర రావు రాజమౌళి ప్రతిభ చూసి షాక్ అయిపోయి నువ్వు ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ వి అవుతావు అంటూ చెప్పాడట…