Chiranjeevi On Vijayakanth: విజయకాంత్ వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారా..? సంచలన నిజం వెలుగులోకి..?

చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 786 సినిమా కూడా విజయ్ కాంత్ నటించిన 'అమ్మన్ కోయిల్ కళీక్కలే' అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు.

Written By: Gopi, Updated On : December 28, 2023 4:33 pm

Chiranjeevi On Vijayakanth

Follow us on

Chiranjeevi On Vijayakanth: తమిళ సినీ నటుడు అయిన విజయ్ కాంత్ అనారోగ్యం కారణంగా ఈరోజు కన్నుమూశారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదైనా కూడా అది విజయ్ కాంత్ చేయాల్సిందే అనేంత మంచి పేరు సంపాదించుకున్నాడు. నిజానికి విజయ్ కాంత్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఆయన సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను అలరించేవి ఇక అందులో భాగం గానే ఆయన ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా బాగా పరిచయమైన వ్యక్తి అనే చెప్పాలి…

అయితే విజయ్ కాంత్ తమిళంలో చేసిన కొన్ని సినిమాలని తెలుగులో చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకునే సినిమా మురగదాస్ డైరెక్షన్ లో విజయకాంత్ హీరోగా వచ్చిన రమణ అనే సినిమా తెలుగులో ఠాగూర్ అనే పేరుతో చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాకి వి వి వినాయక్ దర్శకుడుగా వ్యవహరించాడు…ఇక ఇంతకుముందు కూడా ఆయన విజయ్ కాంత్ చేసిన ‘సత్తం ఓరు ఇరుత్తారై’ సినిమాని చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాగా చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు…

ఇక చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 786 సినిమా కూడా విజయ్ కాంత్ నటించిన ‘అమ్మన్ కోయిల్ కళీక్కలే’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఖైదీ నెంబర్ 786 సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇలా విజయ్ కాంత్ చేసిన చాలా సినిమాలు తెలుగులో చిరంజీవి చేసి మంచి విజయాలను సాధించుకున్నాడు…నిజానికి విజయ్ కాంత్ కి ఉన్న క్రేజ్ వేరు చిరంజీవి కి ఉన్న క్రేజ్ వేరు అయినప్పటికీ ఆ కథలని తీసుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు…

అలా చిరంజీవి కెరియర్ లో ది బెస్ట్ సినిమాలు గా చెప్పుకునే కొన్ని సినిమాలు విజయ్ కాంత్ చేసిన సినిమాలకి రీమేక్ లే కావడం విషయం… ఇక ఇది ఇలా ఉంటే కొద్దిరోజుల నుంచి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజయకాంత్ ఈరోజు అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవడం అనేది నిజంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి ఒక కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి…