Pawan Kalyan And Trivikram: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ఈయన ఎంటైర్ కెరియర్ లో చాలా మంచి సినిమాలు చేశాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా ఏడు విజయాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తూనే తను చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో చేసిన ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవుతున్నాడు…
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే చాలు అనుకుంటున్నారు. కారణమేమిటి అంటే ఆయన పూర్తి టైం పొలిటిషన్ గా మారిపోతే ఇక సినిమాలు చేయడు అనే ధోరణిలో వాళ్ళంతా ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ స్ట్రైయిట్ సినిమాలు చేస్తే బాగుంటుంది.
రీమేక్ సినిమాలు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ సక్సెస్ లను సాధించినప్పటికి ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించడం లేదు. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్…ఆయన వల్లే సినిమాలు బాగా ఆడకపోయిన పవన్ కళ్యాణ్ అవే సినిమాలు చేస్తున్నాడు… కేవలం త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతున్నారు…
ఏ భాషలో ఎవరో చేసిన సినిమాలు పవన్ కళ్యాణ్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ పూర్తి స్వాగ్ కనిపించడం లేదు. స్ట్రెయిట్ కథతో చేసిన ఓజీ సినిమాలో అతని విశ్వరూపం కనిపించింది. కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది… కాబట్టి ఇక మీద పవన్ కళ్యాణ్ స్ట్రైయిట్ సినిమాలు చేయాలని అందులో త్రివిక్రమ్ జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…