Virat Kohli Test Format Retirement : రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. నిలకడ లేని ఫామ్ వల్ల అతడు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ సూచనల మేరకు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి అతడు దూరం జరిగాడు. ఈ నేపథ్యంలో తనను సారధిగా నియమించాలని.. తాను జట్టును ముందుండి నడిపిస్తానని విరాట్ మేనేజ్మెంట్ ను అభ్యర్థించాడు. మేనేజ్మెంట్ దానికి ఒప్పుకోకపోవడంతో అతడు టెస్ట్ ఫార్మాట్ నుంచి వీడ్కోలు పలికాడు.. ఇదే విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి కారణమని మీడియా కథనాలను ప్రసారం చేసింది. గౌతమ్ గంభీర్ ఒత్తిడి తీసుకురావడం వల్లే విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం జరిగాడని కొన్ని మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రసారం చేశాయి.
వాస్తవానికి నిన్నటి వరకు కూడా ఇదే నిజమని అందరూ నమ్మారు. గౌతమ్ గంభీర్ ను తిట్టుకున్నారు.. తను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి కారణాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పెర్త్ వన్డే జరుగుతున్న నేపథ్యంలో విరాట్ తను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి దారి తీసిన పరిస్థితులను విరాట్ వెల్లడించాడు.. ” చాలాకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాను. టెస్ట్, టి20, వన్డే, ఐపీఎల్ ఇలా అన్ని ఫార్మాట్లను విశ్రాంతి అనేది లేకుండా క్రికెట్ ఆడాను. దీనివల్ల కుటుంబ జీవితానికి దూరమయ్యాను. ప్రస్తుతం నేను ఇద్దరు బిడ్డల తండ్రిని. టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం జరిగిన తర్వాత వారిద్దరితో ఎక్కువ సమయం గడుపుతున్నాను. వారితో ఆడుతున్నాను. వారి ఎదుగుదల చూసి ఆనందిస్తున్నాను.. నా భార్యకు కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. వాస్తవానికి నేను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలో ఆడిన తర్వాత.. విరామం అనేది కావలసి వచ్చింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని” విరాట్ పేర్కొన్నాడు.
విరాట్ చేసిన వ్యాఖ్యల తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోడానికి అసలు కారణం తెలిసింది. విరాట్ ప్రస్తుతం వన్డేలలో కొనసాగుతున్నాడు. టెస్టులలో అతని ఆధ్వర్యంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. కాకపోతే న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. వాస్తవానికి అప్పుడు టీం ఇండియా గనుక న్యూజిలాండ్ పై గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విరాట్ సేనకు దక్కేది. టీమిండియాలో దూకుడును, పోరాట తత్వాన్ని, కసిని పెంపొందించిన నాయకుడిగా విరాట్ వినతికెక్కాడు. విరాట్ చూపించిన తెగువ నేటికీ జట్టులో కొనసాగుతోంది.
విరాట్ అద్భుతమైన ఆట తీరు కొనసాగించాడు. తన టెస్ట్ కెరియర్ చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్లో విరాట్ గనుక చివరి వరకు దూకుడు కొనసాగించి ఉంటాయి అతనికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలేది. విరాట్ ఆ సిరీస్ లో ఒక సెంచరీ చేసినప్పటికీ.. ఆ జోరు చివరి వరకు కొనసాగించలేకపోవడం పట్ల ఇప్పటికి అభిమానుల్లో ఒకింత వెలితి కనిపిస్తూ ఉంటుంది.