Pawan Kalyan OG 2: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కినటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు… ఒకప్పుడు ఆయన క్రేజ్ ముందు ఏ స్టార్ హీరో నిలబడలేకపోయారు. అతని కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా కీలకపాత్ర వహిస్తూనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు…ఇక రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేసి సక్సెస్ సాధించారు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలకు ఒకెత్తయితే ఈ మూవీ మాత్రం ఆయనకి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపును తీసుకొచ్చింది…ఇక ఈ సినిమా ఎండింగ్లో ‘ఓజీ 2’ కూడా ఉంటుందని సుజీత్ క్లారిటీ ఇచ్చాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ మూవీ కి సీక్వెల్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక సినిమా చేయడానికి గ్రీ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక ఓజీ 2 సినిమాకి సుజిత్ ని కాకుండా వేరే దర్శకుడిని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
Also Read: సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన వెంకటేష్,త్రివిక్రమ్!
కారణం ఏంటి అంటే సుజీత్ సైతం ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కాబట్టి తను ఆ సినిమా చేయలేకపోవచ్చు. అందుకోసమే ఆయన ప్లేస్ లో మరో దర్శకుడిని కూడా ఎంపిక చేస్తున్నట్టుగా తెలుసింది. ఒకవేళ సుజీత్ కనక ఈ సినిమా చేస్తే తను డైరెక్ట్ చేస్తాడా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కారణం ఏంటంటే ప్రస్తుతం సుజీత్ కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్ లు కేటాయించలేడు. పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినపుడు సుజీత్ బిజీగా ఉంటే ఆ డేట్స్ వేస్ట్ అయిపోతాయి… అలాంటప్పుడు వేరే డైరెక్టర్ ను పెట్టి సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సుజీత్ డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని అతను అయితేనే పవన్ కళ్యాణ్ ను చాలా స్టైలిష్ గా చూపిస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పూర్తి క్లారిటి రావాలంటే ఇంకొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక ఫుల్ మిల్ సినిమా ఇచ్చాడనే చెప్పాలి…
Also Read: అల్లు అర్జున్ కి రెండు లారీల కృతఙ్ఞతలు తెలిపిన నాగార్జున..వీడియో వైరల్!