Nagarjuna Thanks Allu Arjun: తెలుగు కమర్షియల్ సినిమాని ‘శివ'(Shiva ReRelease) కి ముందు, ‘శివ’ కి తర్వాత అని విభజించి మాట్లాడడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త దారిలోకి నడిపించిన సినిమా ఇది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం ద్వారానే ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆరోజుల్లోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన విధానం అద్భుతం. కొన్ని షాట్స్ అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఉపయోగించలేదు. ఇలా కూడా ఆలోచిస్తారా?, కెమెరా ని ఇలా కూడా వాడుతారా?, ఒక సన్నివేశాన్ని ఇలాంటి కోణం లో కూడా చూపించవచ్చా?, అని అప్పటి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రమిది. అప్పటి వరకు క్లాస్ హీరో ఇమేజ్ ఉన్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ని ఊర మాస్ హీరో గా మార్చేసింది ఈ సినిమా.
ఆరోజుల్లో యూత్ ఆడియన్స్ సైకిల్ చైన్స్ పట్టుకొని తిరిగేవారు, అంతలా ప్రభావితం చేసిన చిత్రమిది. నేటి తరం ఆడియన్స్ ఈ సినిమాని ఇంకా చూసి ఉండకపోయుండొచ్చు. ఆరోజుల్లో థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతిని అందించింది ఈ చిత్రం. అప్పటి అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవచ్చు. ఈ తరం ఆడియన్స్ కి కూడా ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని ఇవ్వడానికి ఈ చిత్రం వచ్చే నెల 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ కాబోతుంది. 4K క్వాలిటీ, డాళ్బీ అట్మాస్ సౌండ్ తో, ఈ చిత్రాన్ని రీ మాస్టర్ చేయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ ని స్టార్ హీరోస్ తో చేయిస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) శివ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఒక వీడియో ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి ‘డియర్ అల్లు అర్జున్..నీకు రెండు లారీల థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు.
అల్లు అర్జున్ శివ సినిమా గురించి మాట్లాడుతూ ‘మన శివ సినిమా విడుదలై దాదాపుగా 36 ఏళ్ళు అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే శివ సినిమా ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా, ఇండియన్ సినిమా మేకర్స్ ఆలోచన విధానం లో మార్పు వచ్చింది. అలాంటి సినిమాని మళ్లీ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఈసారి థియేటర్స్ లోకి రెండు లారీల పేపర్స్ తీసుకొని వెళ్ళండి’ అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025