Pawan Kalyan: ‘ఓజీ'(They Call Him OG) చిత్రం సక్సెస్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపడమే కాదు, పవన్ కళ్యాణ్ కి ఇక మీదట ఎలాంటి సినిమాలు చెయ్యాలో అర్థం అయ్యేలా చేసింది. నేటి తరం యూత్ ఆడియన్స్ తన నుండి ఏమి కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా అర్థం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే భవిష్యత్తులో కూడా తానూ చేయబోయే సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఓజీ సీక్వెల్, ఓజీ ప్రీక్వెల్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ఆయన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ, అంతకు ముందే ఒక తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఆ కథ పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, అకీరానందన్ కి కూడా బాగా నచ్చిందట.
వివరాల్లోకి వెళ్తే హాలీవుడ్ లో ‘డేర్ డెవిల్’ అనే వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది. ఇందులో హీరో అంధుడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను సూపర్ హీరో గా మారిపోతాడు. ఆ తర్వాత అతని జీవితం లో ఎదురయ్యే సంఘటనలు, చేసే విన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో ఈ లైన్ మీద భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి ఒక తమిళ దర్శకుడు రెడీ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తమిళ దర్శకుడు ఎవరు?, లోకేష్ కనకరాజ్? లేదా H వినోద్ అనేది చూడాలి. KVN ప్రొడక్షన్స్ వద్ద ఈ ఇద్దరి డైరెక్టర్స్ డేట్స్ ఉన్నాయి. ఇదే స్టోరీ లైన్ తో లోకేష్ కనకరాజ్ డేట్స్ ని వాడుకొని పవన్ కళ్యాణ్ తో సినిమా చేయించాలని KVN ప్రొడక్షన్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ లోకేష్ దర్శకత్వం లో నటించడానికి సిద్ధం.
లోకేష్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ అంతకంటే ముందు ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి ‘ఖైదీ 2’, మరొకటి ‘రోలెక్స్’. ఖైదీ 2 చిత్రం వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రోలెక్స్ కి షిఫ్ట్ అవుతాడు లోకేష్. ఈ రెండు సినిమాలు అయ్యాక పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉంటుంది. పవన్ కూడా ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి, 2027 లోపు లోకేష్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బాగా ఆలస్యం అవుతుందని అనుకుంటే H వినోద్ తో చేయించే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.