Mahesh Babu-Rajamouli: సినిమా ఇండస్ట్రీలో రాణించడమంటే అంత ఆశమాషీ వ్యవహారం కాదు. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా కూడా కెరియర్లు మొత్తం నాశనమైపోతాయి. అందుకే సక్సెస్ లో ఉన్నంత మాత్రాన మేమే తోపులం అని అనుకోకుండా మంచి కాన్సెప్ట్ లను తీసుకొని నమ్ముకుని సినిమాలు చేస్తు ముందుకు సాగితే వాళ్లకు ఎక్కువ కాలం పాటు ఇక్కడ లైఫ్ ఉంటుంది. లేకపోతే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలైతే రావచ్చు…ఇక ఇప్పటికే వరుసగా 12 విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రాజమౌళి లాంటి దర్శకుడు సైతం డౌన్ టు ఎర్త్ ఉంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు…
అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పెను ప్రభంజనాలను క్రియేట్ చేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ లో మాత్రం హాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరికీ పోటీని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ‘జేమ్స్ కామెరూన్’ దర్శకుడు సైతం రాజమౌళి గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు…
అలాంటి రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కేర్ఫుల్ గా వ్యవహరిస్తాడు తద్వారా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక రాజమౌళి మహేష్ బాబు కి ఒక కాస్లి వాచ్ ని గిఫ్టుగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే రీసెంట్ గా చేసిన షెడ్యూల్లో మహేష్ బాబు విపరీతంగా కష్టపడి ఆ షెడ్యూల్ ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారట.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ కి డైరెక్టర్ మారబోతున్నాడా..? సుజీత్ పరిస్థితేంటి..?
యాక్షన్ ఎపిసోడ్లో కూడా మహేష్ చాలా కీలకంగా పాల్గొని ఎక్కడా కూడా దర్శకుడు విజన్ కి అడ్డుపడకుండా చాలా కూల్ గా నీట్ గా చేశారట…దాంతో రాజమౌళి మెచ్చి మహేష్ బాబుకి అదిరిపోయే ఒక ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది… ఇక రాజమౌళి ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ ను సైతం నవంబర్ నుంచి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా ఫస్ట్ వీక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…