https://oktelugu.com/

Pawan Kalyan: సుజీత్, హరీష్ శంకర్ విషయం లో పవన్ కళ్యాణ్ మొండి వైఖరిని అనుసరిస్తున్నాడా..?

స్టార్ డమ్ అనేది మనం చేసే పనిని బట్టి జనం తో మనం వ్యవహరిస్తున్న తీరును బట్టి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి తమ జీవితం లో స్టార్లు గా వెలుగొందే అవకాశం అయితే ఉంది. నిజానికి కొందరు మాత్రమే స్క్రీన్ మీద నిజజీవితం లో స్టార్లు గా వెలు గొందుతారు...

Written By: , Updated On : August 18, 2024 / 10:09 AM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఉన్న లేకపోయినా కూడా వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడూ పోటీ ఉంటూనే వస్తుంది. మా హీరో సినిమా గొప్ప అంటే మా హీరో సినిమా గొప్ప అంటూ ఒకరికి ఒకరు తగువులాడుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక హీరోలంతా కలిసికట్టుగా ఉంటారు. కానీ మధ్యలో అభిమానులు మాత్రమే ఇలాంటి దురుసు వైఖరులను పాటిస్తూ ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక వీటిని ఆపడానికి ఆయా హీరోలు ప్రయత్నం చేసినప్పటికీ అవి వర్కవుట్ అయితే కావడం లేదు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. నిజానికి ఆయనకు ఉన్న గుర్తింపు ఇంకెవరికీ లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన అటు రాజకీయంగా ఇటు సినిమాలపరంగా సమాజ సేవ పరంగా అన్నింటిలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోనే కాదు. రాజకీయంగా కూడా తనకు చాలా అనుభవం ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక తను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జెన్యూన్ గా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయం ఉండే విధంగా చట్టాలను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి లీడరే కదా మనకు కావాల్సింది అంటూ ఆంధ్రప్రదేశ్ జనాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి దీని మీద ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటే మాత్రం హరిహర వీరమల్లు సినిమా మాత్రం వచ్చే సంవత్సరం మొదటి రెండు నెలలు విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా షూటింగ్ కి మరి కాస్త సమయం తీసుకుంటే మాత్రం ఈ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే.. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఓజి సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సుజీత్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అతని మీద దయ తలచడం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొని తన సినిమాని రిలీజ్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…