Rajamouli: అప్ కమింగ్ డైరెక్టర్లకు సలహాలిచ్చిన రాజమౌళి…అది ఒక్కటి మాత్రం చాలా ముఖ్యమట…

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్న ఉంటారు... కానీ కొందరి వల్ల ఇండస్ట్రీ కే గుర్తింపు వస్తుంది అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో రాజమౌళి ఒకరు..

Written By: Gopi, Updated On : August 18, 2024 8:50 am

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఒకే ఒక డైరెక్టర్ రాజమౌళి…ప్రస్తుతం పాన్ వరల్డ్ లో తన స్థాయిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పైన తన సత్తా చాటుకున్న ఆయన మొదటిసారి పాన్ వరల్డ్ లో చేయబోయే సినిమా కోసం భారీ స్కెచ్ లను కూడా వేస్తూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్న రాజమౌళి ఈ సినిమాని ఎప్పుడూ మొదలు పెడతాడనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన క్లారిటీ రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తను గొప్ప డైరెక్టర్ గా ఎదగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆయనకి విజువలైజేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట. ఆయన ఏ పాత్రనైనా సరే చాలా విజువల్ గా ఊహించుకొని తన మైండ్ లోనే తనకు ఒక రూపాన్ని క్రియేట్ చేసుకొని ఆ పాత్ర హావభావాలు ఏర్పాటు చేసుకుంటాడట.

ఇక ముఖ్యంగా ఆయనకి ఈ అలవాటు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఆయనకు చాలా కథలను చెబుతూ ఉండేవారట. అలాగే చదవడానికి ఆయనకి చాలా బుక్స్ ఇచ్చేవారట. రాజమౌళి అలా బుక్స్ చదువుతున్నప్పుడు ఆయన ముందు ఆ క్యారెక్టర్లు కదులుతున్నట్టుగా ఊహించుకునే వాడట…

ఇక మొత్తానికైతే అలాంటి ఒక ఇమేజినేషన్ పవర్ ను తను క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టే తన సృష్టి నుంచి చాలా గొప్ప గొప్ప సినిమాలైతే వస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…రాజమౌళి అంటే ఒక ముద్ర పడిపోవడమే కాకుండా పాన్ వరల్డ్ ఇండస్ట్రీ కూడా అతని కోసం ఎదురుచూస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన స్థాయి ఏంటి అనేది…ఇక ఆయన అప్ కమింగ్ గా వచ్చే సినిమా దర్శకులకు కూడా పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచనలను ఇస్తున్నాడు. ఎందుకంటే దాని వల్లే ఇమాజినేషన్ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుందంటూ చెప్పాడు.

ఇక ఇప్పటికి కూడా రాజమౌళి రోజుకు కనీసం ఒక బుక్ లో కొన్ని పేజీలైనా చదువుతూ ఉంటాడట. అలా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాడు. అలాగే సినిమాలను కూడా ఎక్కువగా చూస్తారట. తనుననుకున్న పాయింట్ ను సినిమా రూపం లో చెప్పడానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలి అనే దానిమీద చాలా ఎక్కువ సేపు వర్క్ చేస్తూ మొత్తానికైతే ఆయన రోజుకు దాదాపు 18 గంటల పాటు శ్రమిస్తాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…