Pawan Kalyan: చిరంజీవి చేసిన తప్పే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా..?

చిరంజీవి ఒకప్పుడు రీమేక్ సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకున్నారు. కొన్ని సార్లు మాత్రం దారుణమైన పరాభావాలను కూడా మూటగట్టుకున్నారు.

Written By: Gopi, Updated On : January 17, 2024 7:37 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆయన ఒకప్పుడు చేసిన మాస్ సినిమాలు ఇప్పుడు కూడా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఆ సినిమాలు ఇప్పుడు చూసిన కూడా ఏ మాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా చాలా నీట్ గా ఉంటాయంటూ పలువురు సినీ అభిమానులు సైతం చిరంజీవి మీద వాళ్లకు ఉన్న అభిమానాన్ని చాటుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు రీమేక్ సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకున్నారు. కొన్ని సార్లు మాత్రం దారుణమైన పరాభావాలను కూడా మూటగట్టుకున్నారు.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి బాటలోనే నడుస్తున్నాడా అంటూ పలువురు సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం వరుస రీమేకులు చేస్తూ వస్తున్నాడు. దానివల్ల ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోతుందంటు పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా అయిన ఓ జి సినిమా సక్సెస్ సాధిస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది. 2013 వ సంవత్సరంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఇప్పటివరకు ఒకటి రెండు సక్సెస్ అందుకున్నప్పటికి అవి భారీ సక్సెస్ లు అయితే కావు దాంతో ఇప్పుడు ఆయనకు తప్పకుండా ఒక సాలీడ్ హిట్ సినిమా పడాలి.

లేకపోతే మాత్రం ఆయన కెరీర్ కూడా చాలా వరకు డౌన్ ఫాల్ అయ్యే అవక్షం ఉందని తెలుస్తుంది… ఇక ఇంతకు ముందు చిరంజీవి నడించిన బాటలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నాడు అంటు అభిమానులకి కొంతవరకు ఆందోళన అయితే కలుగుతుంది. ఎందుకంటే రీమేక్ లతో ఇప్పుడు సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు కాబట్టి స్ట్రైయిట్ సినిమాలు చేస్తే బెటర్ అనే ఆలోచనలో జనాలు ఉన్నారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆలోచించి ముందుకు కదిలితే మంచిదని పలువురు అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…