
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ పట్టాలెక్కింది. ‘అయ్యప్పమ్ కోషియమ్’ రిమేక్ మూవీ షూటింగ్ ను పవన్ ఈరోజు నుంచి మొదలు పెట్టేశాడు. అయితే అంతకుముందే షూటింగ్ ప్రారంభించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఏమైందన్న సందేహాలు అందరిలోనూ కలిగాయి.
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. అది పూర్తికాకముందే పవన్ మరోసినిమా మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయగల సామర్థ్యం క్రిష్ సొంతం.. ఈ క్రమంలోనే పవన్ తో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ను ఇప్పటికే 40శాతం పూర్తి చేశాడు. క్రిష్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా చెబుతున్నారు. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏఏం రత్నం. పవన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ కూడా ఇదే. విజువల్ఎఫెక్ట్ ఆధారంగా చిత్రం తీర్చిదిద్దుతున్నారు.
16వ శతాబ్ధం కథతో.. బందిపోటుగా పవన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతికి అనుకున్న అది సాధ్యం కాదని.. ‘అయ్యప్పమ్ కోషియం’ రిమేక్ నే సంక్రాంతికి ఫిక్స్ చేశారట పవన్. ఎందుకంటే ‘హరిహర వీరమల్లు ’ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ లు భారీగా ఉన్నాయట.. దానికితోడు విజువల్ ఎఫెక్ట్ తో పని ఉంది. అవి కావడానికి టైం పడుతుంది. అందుకే హడావుడిగా చేయడం కంటే టైం తీసుకొని తీద్దామని పవన్ ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి ‘అయ్యప్పమ్ కోషియం’ రిమేక్ కు డేట్స్ ఇచ్చాడట.. అందుకే ఈసినిమాను తాత్కాలికంగా పక్కనపెట్టాడట పవన్.