Mahesh – Rajamouli : మహేష్ మూవీ కోసం రాజమౌళి వర్క్ షాప్… మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ రంగంలోకి, కీలక ప్రకటన దిశగా అడుగులు!

Mahesh - Rajamouli ఆయన తెరకెక్కించిన మూడు భారీ ప్రాజెక్ట్స్ బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల విషయంలో ఇదే పద్దతి ఆయన ఫాలో అయ్యారు. అలాగే కథతో పాటు జోనర్ పై క్లారిటీ ఇస్తారు. తాను చేయబోయే మూవీ ఎలా ఉంటుందో ముందే ప్రేక్షకుల్లో అవగాహన ఏర్పరుస్తారు. ఆయన సక్సెస్ కి అది కూడా ఒక కారణం. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తున్నానని చెప్పారు. తర్వాత పలు సందర్భాల్లో ఒక్కో సంగతి పంచుకున్నారు.

Written By: NARESH, Updated On : July 8, 2024 8:32 pm

When will Rajamouli Mahesh movie start

Follow us on

Mahesh – Rajamouli : ఎస్ఎస్ఎంబీ 29 ప్రకటన కోసం అందరూ వెయిటింగ్. మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో మూవీ ఖాయమే. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారు. స్క్రిప్ట్ వర్క్ సైతం పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని సమాచారం. అయితే రాజమౌళి-మహేష్ బాబు ప్రెస్ మీట్ కోసం టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాజమౌళి తన ప్రతి సినిమా ఆరంభానికి ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. తాను చేయబోయే చిత్రంకి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెల్లడిస్తాడు.

ఆయన తెరకెక్కించిన మూడు భారీ ప్రాజెక్ట్స్ బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల విషయంలో ఇదే పద్దతి ఆయన ఫాలో అయ్యారు. అలాగే కథతో పాటు జోనర్ పై క్లారిటీ ఇస్తారు. తాను చేయబోయే మూవీ ఎలా ఉంటుందో ముందే ప్రేక్షకుల్లో అవగాహన ఏర్పరుస్తారు. ఆయన సక్సెస్ కి అది కూడా ఒక కారణం. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తున్నానని చెప్పారు. తర్వాత పలు సందర్భాల్లో ఒక్కో సంగతి పంచుకున్నారు.

కాగా మరో నెల రోజుల్లో రాజమౌళి-మహేష్ బాబు మీడియా ముందుకు వస్తారనే టాక్ వినిపిస్తుంది. అలాగే కాన్సెప్ట్ పోస్టర్, వీడియో లేదా మహేష్ బాబు లుక్ సైతం పంచుకునే అవకాశం కలదంటున్నారు. ఇప్పటికే ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తెలియజేశారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహా చిత్రమని వెల్లడించారు.

కాగా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షాప్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. విదేశాల నుండి వచ్చిన రాజమౌళి ఈ పనుల్లో తలమునకలు అయ్యారట. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో కీలక రోల్ చేస్తున్నారట. ఆయన వర్క్ షాప్ లో పాల్గొననున్నారట. డైలాగ్ డెలివరీ కి సంబంధించి ఆయనకు రాజమౌళి సూచనలు చేస్తారని సమాచారం. ఇక మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించడం దాదాపు ఖాయమే అంటున్నారు. హీరో విక్రమ్ విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ విశ్వసనీయ సమాచారం లేదు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అట.