Allu Sirish Career: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు, వాళ్ళు చేస్తున్న సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన ఇండస్ట్రీలో వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతోంది. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా చాలా గొప్ప విజయాలను సాధించాడు. ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో తను కూడా ఒకరు కావడం విశేషం…తన కొడుకు అయిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాడు…ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గుర్తింపును తీసుకొచ్చాడు. గత సంవత్సరం ‘పుష్ప 2’ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేశాడు. అలాంటి అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ అన్నకి తగ్గ తమ్ముడిగా ఎదుగుతాడని అందరు అనుకున్నారు. కానీ ఆయన ఒక్క సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
కెరియర్ మొదట్లో గౌరవం, శ్రీరస్తు శుభమస్తు లాంటి మంచి సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత సినిమాలను చేయడంలో విఫలమయ్యాడు. తనకు ఎలాంటి సినిమాలు చేయాలనే విషయం మీద సరైన క్లారిటీ లేకుండా పోయింది. వాళ్ళ నాన్న అయిన అల్లు అరవింద్ వల్లే ఆయన కెరియర్ చాలా వరకు డౌన్ అయింది.
అల్లు శిరీష్ ఎంచుకున్న సబ్జెక్టును కాదని ఇంకా పెద్ద కథలతో సినిమాలు చేయాలని కొంతవరకు గ్యాప్ తీసుకోమని చెప్పాడట. ఆ క్రమంలోనే టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని వాళ్ళను సెట్ చేసే పనిలో ఉన్నప్పటికి అది వర్కౌట్ కాలేదట. ఒకరకంగా అల్లు అరవింద్ వల్లనే అల్లు శిరీష్ సినిమా కెరియర్ అనేది చాలా వరకు ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…చూడాలి మరి ఇక మీదట తన కెరియర్ లో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయన టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…