Today 12 October 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఆదివారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారంలకు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించుకుంటారు. పెండింగ్లో ఉన్న డబ్బులు వసూలు అవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆన్లైన్లో పెట్టుబడిలు పెట్టిన వారికి ఇప్పుడు లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలతో కొన్ని ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. బంధువుల సహాయంతో అప్పులు తీరుస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ సమయంలో పెద్దల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా ముందుకు వెళ్లాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అదృష్టవంతులు. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి కావడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని పనుల వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కాస్త ఆలోచించి ముందుకు వెళ్లాలి. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. సోదరుల మధ్య ఉన్న ఆస్తి విభేదాలు తొలగిపోతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు భాగస్వాముల మద్దతు ఉండటంతో లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తుపై కిలగ నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొన్ని సంస్థల నుంచి గెలుపు వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్నేహితులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారాలు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన పని కోసం అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఈ సమయంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఉన్న వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే మానసికంగా ఆందోళనతో ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతర సలహా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలకు ఇబ్బందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉంటుంది. దీంతో చేపట్టిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. ఈ క్రమంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారులకు పెద్దల మద్దతు ఉండడంతో లాభాలు పొందుతారు. కొన్ని పనులను పెండింగ్ వేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసే ప్రయత్నం చేయాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలో పాల్గొంటే ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ఉద్యోగులు మాత్రం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. జీవిత భాగస్వామితో షాపింగ్ చేసేటప్పుడు ఖర్చుల విషయంలో ఆలోచించాలి. దుబారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు దైవానికి గ్రామం అండగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు పరిష్కారం అవుతాయి.