OG Movie Collections Day 16: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him Og) చిత్రం విడుదలై నిన్నటితో 16 రోజులు పూర్తి అయ్యింది. ఈ 16 రోజుల్లో ఈ సినిమా ఎన్నో మైల్ స్టోన్స్ ని దాటుకుంటూ ముందుకొచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. మొదటి వీకెండ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంత లాంగ్ రన్ వచ్చి చాలా కాలమే అయ్యింది. వకీల్ సాబ్ చిత్రానికి భారీ లాంగ్ రన్ వచ్చేది కానీ, అప్పటికి కరోనా మహమ్మారికి విలయతాండవం ఆడుతుండడం వల్ల థియేటర్స్ ని లాక్ డౌన్ కారణంగా మధ్యలోనే ముయ్యాల్సి వచ్చి లాంగ్ రన్ ని చూడలేకపోయింది. ఇప్పుడు ఆ లాంగ్ రన్ ని ఓజీ చిత్రం ద్వారా చూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఒక్క రెండవ వారం లోనే ఈ చిత్రం రిటర్న్ జీఎస్టీ తో కలిపి 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టడం సంచలనంగా మారింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో, అనగా 16 వ రోజున 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటింది. ఇప్పటి వరకు ఈ మార్కుని రాజమౌళి సినిమాలు కాకుండా కల్కి, సలార్, దేవర, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే దాటాయి. ఇప్పుడు ఆ స్థానం లోకి ఓజీ చిత్రం కూడా వచ్చి చేరింది. ‘హరి హర వీరమల్లు’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి కేవలం రెండు నెలల సమయం లోనే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ తగలడం, ఆయన అభిమానులకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఇక 16 వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 60 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
నిన్న ఫస్ట్ షోస్ నుండి ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో వసూళ్ల పరంగా బాగా పుంజుకున్నాయి. నేడు శనివారం కావడంతో నిన్న వచ్చిన గ్రాస్ కంటే డబుల్ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో కూడా ఈ చిత్రానికి నేడు గంటకు రెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. 17 వ రోజున ఒక సినిమా బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ అవ్వడం మనం చాలా అరుదుగా చూసి ఉంటాము. మొత్తం మీద 16 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 180 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా నేడు ఈ చిత్రం 32 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటనుంది.