ఉదాహరణకు షా రుఖ్ ఖాన్ కి టోనీ ఆషే తో వ్యాపార లావాదేవీలు వున్నాయి. దుబాయ్ లో వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులు వున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కాశ్మీర్ లో భారత సైన్యం పై ఎన్నో ఆరోపణలు చేయటమే కాకుండా హింసను కూడా ప్రోత్సహించాడు. ఇతను బ్రిటిష్ పౌర సత్వం వున్న పాకిస్తానీ. ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల వైఖరినే ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే ఇంకో వ్యక్తి ఐ ఎస్ ఐ తో సంబంధాలు వుండి కూడా బాలీవుడ్ లో ప్రముఖలతో సంబంధాలు నేరపుతున్నాడు. అనిల్ కపూర్ తో వ్యాపార భాగస్వామి గా వున్నాడు. అలాగే కరణ్ జోహార్ తో కూడా ఇంకో వ్యక్తి ఇటువంటి సంబంధాలే వున్నాయి. ఇంతకుముందు సంజయ్ దత్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసికూడా చూసి చూడనట్లు వుండటం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే .
ఇందులో సంబంధాలు నెరుపుతున్న సెలబ్రిటీలు అందరికీ దేశ వ్యతిరేక కార్యక్రమాలతో సంబంధాలు వుండి ఉండక పోవచ్చు. అదే సమయంలో ఎవరికీ లేవని కూడా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఇది ఇలాగే కొనసాగటం దేశ భద్రతకు ప్రమాదం. ఇప్పటికైనా భారత ప్రభుత్వ హెచ్చరికతో నైనా ఈ సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే మంచిది. అలాగే ముందుగా పాకిస్తాన్ తో, ఐ ఎస్ ఐ తో సంబంధాలు నేరిపే వారు, మన భారత సైన్యం పై అవాకులు చెవాకులు పేలే వాళ్ళతో సంబంధాలు ముఖ్యంగా వ్యాపార సంబంధాలు ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది. లేకపోతే ప్రభుత్వమే వీళ్ళను వివరణ కోరాల్సిన అవసరం వుంది. ఇదేదో మీడియా లో పెద్ద వివాదమవుతుందని వెనకాడితే దేశ భద్రతను ఫణంగా పెట్టినవాల్లవుతారని మరిచిపోవద్దు. బాలీవుడ్ ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. ఆ సాహసం మోడీ నే చేయగలడు. ఆ పని మొదలు పెడతాడని ఆశిద్దాం.