నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు చెప్పిన ఫేమస్ డైలాగ్.. ‘ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడకుందాం..’ ప్రస్తుతం చంద్రబాబు మాటలు విన్న వైసీపీ నేతల మసులో డైలాగ్ కూడా బహుశా ఇదే కావచ్చు. దానికి కారణం ఏపీ ప్రతి పక్ష నేత చంద్రబాబు నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కోర్ట్ తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్ చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆ విధంగా రాజ్యాంగ గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని గవర్నర్ కాపాడాడని కొనియాడారు. కాగా గవర్నర్ పై బాబుకు ఇదే అభిప్రాయం ఎల్లకాలం, అన్ని సంధర్భాలలో ఉంటుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న.
Also Read: జగన్ మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమా?
నిమ్మగడ్డ వ్యవహారం కేవలం ఒక వ్యక్తికి మరియు రాజ్యాంగంబద్ద పదవికి సంబందించిన వ్యవహారం మాత్రమే. ఆయన పదవీ కాలం ముగియగానే పక్కకు తొలగాల్సిందే. కానీ అంతకంటే కీలకమైన రెండు బిల్లులు, టీడీపీ ప్రాణపదమైన అంశాలు గవర్నర్ పరిధిలో ఉన్నాయి. మూడు రాజధానుల అంశంతో పాటు, సి ఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లులను వైసీపీ ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి, మండలికి పంపడం జరిగింది. శాసన మండలి చైర్మన్ టీడీపీ నేత కావడంతో పాటు, అక్కడ ఆ పార్టీకి బలం ఉన్న కారణంగా బిల్లులను ఆమోదించకుండా…వాయిదా వేశారు. కాల పరిమితి ముగియడంతో, పరోక్షంగా మండలి అనుమతించినట్లే భావించి, గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. ఐతే గవర్నర్ ఈ బిల్లులపై న్యాయ సలహా అడిగారు. టీడీపీ మరియు బీజేపీ పార్టీలు గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించ కూడదని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒక వేళ ఈ రెండు బిల్లులకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బాబు ఇన్నాళ్ల ప్రయత్నం వృధా అయినట్లే. వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా బిల్లులను ఆమోదించినందుకు గవర్నర్ పై ఆయన ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండడం ఖాయం. రాజ్యాగం బద్ద పదవిలో ఉండి వైసీపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ఆరోపణలు చేసే అవకాశం కలదు. కాబట్టి నేడు పొగిడిన బాబు… రేపు ఆయన ఆ రెండు బిల్లులకు ఆమోదం తెలిపితే గవర్నర్ పై ఆయన వెర్షన్.. చాలా హార్ష్ గా ఉండనుంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈ ఎస్ ఎల్ నరసింహన్ పై బాబు ఏ స్థాయిలో ఆరోపణలు చేశారో ఇంకా ఎవరూ మరచిపోలేదు. పాదయాత్ర సమయంలో జగన్ పై జరిగిన దాడి గురించి నరసింహన్ డీజీపీ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా…ఆయన ఏ అధికారంతో నేరుగా డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడుగుతారు అని ప్రశ్నించారు.మోడీతో విభేదించాక గవర్నర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ..బాబు మరియు ఆయన బ్యాచ్ ఎన్ని విమర్శలు చేశారో తెలిసిందే.
Also Read: జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్