https://oktelugu.com/

వేశ్యగా మారనున్న యాంకర్ అనసూయ !

హాట్ యాంకర్ అనసూయకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీకి కాస్త కోపం కూడా ఎక్కువే. నెటిజన్లు కాస్త ఆశతోనే అమాయకత్వంతోనే చేసే కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుని వారి పై తన ఆవేశాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే… ఏది ఏమైనా ఈ జనరేషన్ కుర్రాళ్ళకు అనసూయ ఒక డ్రీమ్ గర్ల్ […]

Written By:
  • admin
  • , Updated On : July 22, 2020 / 08:57 PM IST
    Follow us on


    హాట్ యాంకర్ అనసూయకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీకి కాస్త కోపం కూడా ఎక్కువే. నెటిజన్లు కాస్త ఆశతోనే అమాయకత్వంతోనే చేసే కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుని వారి పై తన ఆవేశాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే… ఏది ఏమైనా ఈ జనరేషన్ కుర్రాళ్ళకు అనసూయ ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతూ బాగానే అలరిస్తుంది.

    Also Read: మహిళా టెర్రరిస్ట్‌గా సమంత!

    పైగా ‘రంగస్థలం’ ‘యాత్ర’ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. నటిగా కూడా మంచి డిమాండ్ క్రియేట్ చేసుకుంది. ఆ సినిమాల తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చినా ఈ ముదురు బ్యూటీ మాత్రం ఆచితూచి ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత మరియు కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని చూజ్ చేసుకుంటూ కెరీర్ ను హీరోయిన్ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటుంది. అయితే కృష్ణవంశీ చేస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా కృష్ణవంశీ నుండి ఆఫర్ రావడం, పైగా కథలో కీలకమైన పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేసింది.

    అయితే అనసూయది ఓ వేశ్య పాత్ర అట. కాస్త ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న పాత్ర కావడం, వేశ్య జీవితంలోని బాధలు, అవమానాలు ఎలా ఉంటాయి అనే కోణంలో పాత్ర సాగడంతో అనసూయ ఈ సినిమా పై బాగానే హోప్స్ పెట్టుకుంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందని.. ఆ సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారని తెలుస్తోంది. కాస్త హాట్ నెస్ ఎక్కువ ఉన్న ఆ సీన్స్ తోనే సినిమాని మార్కెట్ చేసుకోవటానికి కృష్ణవంశీ ప్లాన్ చేసుకుంటున్నాడట.

    Also Read: ప్రభాస్‌ మూవీలో దీపిక పాత్ర రివీల్‌!

    కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కి సెకెండ్ లీడ్ గా అనసూయ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి కృష్ణవంశీకి ఈ సినిమాతోనైనా దశ మారుతుందేమో చూడాలి.