https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి పాటించే ఈ ఒక్క స్ట్రాటజీ వల్లే ఆయన సినిమాలకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయా..?

మై నెక్స్ట్ లో కొంతమందికి వరస సక్సెస్ లో దక్కుతూ ఉంటాయి అందులో రాజమౌళి ఒకరు ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం... ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా దానిని సూపర్ సక్సెస్ గా నిలపడం ఆయన నైజం...

Written By:
  • Gopi
  • , Updated On : August 31, 2024 / 02:30 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ఈయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా తన పేరు మారు మ్రోగి పోయింది. అలాగే హాలీవుడ్ లో కూడా ఆయన పేరుకు ఒక బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ అయింది. దాంతోనే ఆయన డైరెక్టర్ హాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన ఆయన కెరియర్ హాలీవుడ్ స్థాయికి విస్తరించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మహేష్ బాబు తో కలిసి ఈయన చేస్తున్న సినిమా విషయంలో చాలావరకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. మరి దానికి అనుకూలంగానే సినిమా మీద వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఎప్పుడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజే సినిమాను కూడా ఎప్పుడూ రిలీజ్ చెయ్యాలి అనే ఉద్దేశంలో రాజమౌళి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే 1200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలను పెట్టుకున్నారు. నిజానికి పర 1200 కోట్ల బడ్జెట్ అంటే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి కూడా అంత భారీ బడ్జెట్ అనేది కేటాయించలేదు.

    మొదటిసారి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని పాన్ వరల్డ్ సినిమాలు తెరకెక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమా కోసమే రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తను అనుకున్నట్టుగా ఈ సినిమాని సక్సెస్ చేయగలిగినట్లైతే ఈజీగా 3000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తలుచుకుంటే ఎంతటి అసాధ్యాన్ని అయిన సరే సు సాధ్యం చేసేస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఎందుకంటే ఆయన ఇంతవరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒక ప్రయోగాత్మకమైనవే సినిమాలే… అందువల్లే ఆయన సినిమాలకి రీచ్ అనేది పెరిగి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం ఒక అదృష్టమనే చెప్పాలి. ఇక ఈయన సినిమాల్లో ఎక్కువగా ఎమోషన్స్ ఎలివేషన్స్ ని హైలెట్ అవుతూ ఉంటాయి. వాటి వల్లే ప్రేక్షకులు సినిమాలను రిపీటెడ్ గా చూసే ఆలోచనలో ఉంటార. దానివల్ల సినిమాకి ఆటోమేటిక్గా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

    రాజమౌళి మొదటి నుంచి ఇప్పటివరకు ఇదే స్ట్రాటాజిని పాటిస్తూ వస్తున్నాడు. ఒకసారి సినిమా చూసి వదిలేయడం కాదు. ప్రతి ఒక్కరు ఆయన చేసిన సినిమాని రెండుసార్లు చూస్తే కలెక్షన్స్ భారీగా వస్తాయనే ఉద్దేశ్యంతో ఆయన సినిమానైతే తెరకెక్కిస్తు ఉంటాడు…