https://oktelugu.com/

Maruti Suzuki Offers: మారుతి బంఫర్ ఆఫర్.. ఈ రెండు కార్లలో కొత్త ఫీచర్లు.. అయినా ధర తక్కువే..

దేశంలో కార్ల ఉత్పత్తితో మారుతి ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే బడ్జెట్ కార్లు తీసుకొస్తూ సామన్యులను ఆదుకుంటుందని కొందరి అభిప్రాయం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 31, 2024 2:38 pm
    Maruti Suzuki introduced new features in Alto K10 and S Presso

    Maruti Suzuki introduced new features in Alto K10 and S Presso

    Follow us on

    Maruti Suzuki Offers: కారు కొనడం కొందరికి కల. ఈ కలను కొందరు వెంటనే నెరవేర్చుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం పొందిన కొద్ది కాలంలోనే ఆర్థికంగా వృద్ధి చెందిన సమయంలో వెంటనే కారు కొనుగోలు చేస్తారు. అయితే కారు కొనే వారిలో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొందరు ఫీచర్లు, మరికొందరు బడ్జెట్ ప్రకారంగా కార్లు కొనుగోలు చేస్తుంటారు. తక్కువ బడ్జెట్ లో చిన్న కారు తీసుకోవాలని అనుకుంటారు. అయితే బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఆ కార్లలో కొన్ని ఫీచర్లను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కోసారి తక్కువ బడ్జెట్ కార్లు తక్కువ సేల్స్ నమోదు చేసుకుంటారు. దీంతో కంపెనీలో అటువంటి మోడళ్లలో అదనపు ఫీచర్లను చేర్చి వాటి అమ్మకాలను పెంచుతారు. తాజాగా మారుతి కంపెనీ రెండు బడ్జెట్ కార్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో అదనంగా ఓ ఫీచర్ చేర్చి అమ్మకాలు పెంచాలని చూస్తోంది. ఇంతకీ ఏంటా ఫీచర్? అది ఎలా ఉంటుంది?

    దేశంలో కార్ల ఉత్పత్తితో మారుతి ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే బడ్జెట్ కార్లు తీసుకొస్తూ సామన్యులను ఆదుకుంటుందని కొందరి అభిప్రాయం. అందుకే కొత్తగా బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారు మారుతి కంపెనీ వైపు చూస్తారు. అయితే మారుతి నుంచి ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ కార్లలో ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సె వంటి మోడళ్ల గురించి ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో సామాన్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    అయితే వీటి ఉత్పత్తులను మరింత సేల్స్ పెంపొందించేలా ఇందులో కొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. అదే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం(ESP). ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం ఫీచర్ వలన కారు వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు రక్షణ ఇస్తుంది. ఎటువంటి ప్రమాదాల నుంచైనాత తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉండను్నాయి. అలాగే వాహనాలు స్కిడ్డింగ్ నుంచి ఇది తప్పిస్తుంది.

    సాధారణంగా కార్లు రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందితేనే భద్రత ఎక్కువగా ఉందని అనుకుంటాం. అయితే మారుతి కంపెనీకి చెందిన ఈ కార్లు రక్షణ విషయంలో తక్కువ సేప్టీ రేటింగ్ పొందాయి. కానీ ఈఎస్ పీ ని చేర్చడం ద్వారా ఇవి మరింత భద్రతతో కూడుకొని ఉంటాయి. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా కార్లు మెరుగైన భద్రతను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ సెక్యూరిటీ ఫీచర్లతో క్రాస్ టెస్టింగ్ లోనూ మంచి స్టార్ రేటింగ్ పొందే అవకాశం ఉంది.

    అయితే ఈ కారుకొనేవారికి శుభవార్త ఏంటంంటే… కొత్త ఫీచర్లు అదనంగా జోడించినప్పటికటీ వీటి ధరలు మాత్రం పెంచడం లేదు. ప్రస్తుతం మారుతి ఆల్టో కే 10 రూ.3.99 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఎస్ ప్రెస్సో రూ4.26 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ లోబడ్జెట్ కార్లను ఇప్పుడు కొత్త ఫీచర్లు కలిగి ఉన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.