Viral Video: పైలెట్, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి నిపుణులు శిక్షణ ఇస్తుంటారు. ఏ దేశంలో అయినా శిక్షణ తర్వాతనే వారికి విమానాలు, హెలికాప్టర్లు నడిపే అవకాశం ఇస్తారు. అయితే శిక్షణ సమయంలో చిన్నచిన్న పొరపాట్ల కారణంగా చాపర్‌లు కూలిపోతుంటాయి. కొన్నింటిలో సాంకేతిక సమస్యలు తలెత్తి కూలిపోతాయి. ఇలాంటి ఘటనల్లో కూడా కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా శిక్షణ, అనుభవం ఉన్న పైలెట్లు నడుపుతున్న విమానాలు, హెలికాప్టర్లు కూడా కూలిపోతాయి. తాజాగా ఓ హెలికాప్టర్‌ను మరమ్మతుకు తరలిస్తుండగా కూలిపోయింది. చాపర్ నుంచి జారిపడింది. అయితే చాలా మందికి విమానాలు, హెలికాప్టర్లను ఎలా మరమ్మతుకు తరలిస్తారో తెలియదు. విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులలో అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. అలా కాని పక్షంలో క్రాశ్ అవుతాయి. ఇక హెలికాప్టర్లకు ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టు అవసరం లేదు. ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే జనాలు లేని ప్రదేశంలో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. ఇలాగే ల్యాంగిండ్ చేసిన హెలిక్యాప్టర్‌ను మరమ్మతులకు తరలిస్తుడగా కూలిపోయింది.
ఎక్కడ జరిగిందంటే..
హె లికాప్టర్లను మరమ్మతులకు తరలించడం గురించి చాలా మందికి తెలియదు. హెలికాప్టర్ డిసైనింగ్ కారణంగా ఎక్కడైనా నిలిపే వీలు ఉంటుంది. ఎక్కడైనా మరమ్మతుకు వస్తే దానిని రిపేర్ సెంటర్‌కు మరో హెలిక్యాప్టర్ సహాయంతో తీసుకెళ్లారు. మరమ్మతుకు వచ్చిన హెలిక్యాప్టర్‌ను తాడుతో కట్టి.. మరో హెలికాప్టర్‌కు కట్టి గాలిలో వేలాడదీస్తూ తీసుకెళ్లారు. ఇది పెద్ద ప్రక్రియ. ఇప్పుడు ఇలాగే తీసుకెళ్తున్న హెలిక్యాప్టర్ జారిపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్‌కు కేబుల్స్‌తో కట్టి రిపేర్ అయిన హెలికాప్టర్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అధిక బరువు ఉండటంతో పాటు..విపరీతంగా గాలులు వీయడంతో బ్యాలెన్స్ కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. రిపేర్ అయిన హెలికాప్టర్‌ను అలాగే తీసుళ్తే రెండంటికీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి దాన్ని వదిలేశారు. దీంతో భారీ ఎత్తునుంచి రిపేర్ అయిన హెలికాప్టర్ కింద పడిపోయింది.
జనాలు లేని ప్రాంతంలో..
కేదార్‌నాథ్‌కు భక్తులను తరలించేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగిస్తుంటారు. గత మే నెలలో ఓ హెలికాప్టర్‌ను ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.. అప్పటి నుంచి ఆ ట్రావెల్స్ కంపెనీ హెలికాప్టర్‌ను పక్కన పెట్టింది. శనివారం దానిని మరమ్మతు చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఆర్మీకి చెందిన ఎంఐ–17 ఛాపర్ తో ఈ హెలికాఫ్టర్‌ను గౌచర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కేబుల్స్‌తో బిగించిన తర్వాత హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. దాంతోపాటు రిపేర్ అయిన హెలికాప్టర్ కూడా గాల్లోకి వెళ్లింది. కొద్దిదూరం వెళ్లిన వెంటనే ప్రతికూల వాతావరణంతో రెండు హెలికాప్టర్లకు ప్రమాదం ఏర్పడింది. బలమైన గాలులకు ఎంఐ17 చాపర్ ఒడిదుడుకులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతుకు వచ్చిన హెలిక్యాప్టర్‌ను వదిలేయాలని సూచించారు. పెలెట్లు రిపేర్ అయిన హెలికాప్టర్‌ను వదిలేశారు. అది జనం లేని రాళ్లలో పడిపోయింది. పూర్తిగా ధ్వంసం అయ్యింది. లింఛోలి ఏరియాలో మందాకిని నదిలో ఈ హెలికాఫ్టర్ పడిపోయింది.
Dramatic video coming in :
A Kestrel Aviation aircraft which was being taken underslung from Kedarnath to Gauchar has been released midway near Bhimballi as it was said to be unstable.
Kestrel Aviation recently had a chopper incident in Kedarnath.
— Tarun Shukla (@shukla_tarun) August 31, 2024